నా కొడుకు నుంచి నన్ను కాపాడండి.. మోహన్ బాబు ఫిర్యాదు!

మంచు మనోజ్‌పై మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. మనోజ్ నుంచి ముప్పు ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. తన ఇంటిని మనోజ్ లాక్కున్నాడని అందులో తెలిపినట్లు సమాచారం. మనోజ్‌ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ మోహన్ బాబు లేఖలో కోరినట్లు తెలిసింది.

New Update
mohan babu,

మంచు ఫ్యామిలీలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. కొడుకు మనోజ్‌పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్‌కు మోహన్ బాబు లేఖ రాశారు. మనోజ్ నుంచి ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మనోజ్ నుంచి రక్షణ కల్పించండి: మోహన్ బాబు

Also Read: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!

తన ఇంటిని మనోజ్ లాక్కున్నాడని ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా ఇళ్లు వదిలేయమని మనోజ్ బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. అందువల్ల మనోజ్‌ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ మోహన్ బాబు లేఖలో కోరినట్లు సమాచారం. కాగా మోహన్‌ బాబు కంటే రెండు గంటల ముందే పహడి షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మోహన్ బాబుపై చర్యలు తీసుకోండి: మంచు మనోజ్

మంచు మనోజ్ తాజాగా పోలీస్టేషన్‌కు చేరుకున్నాడు. దాదాపు ఆరు వాహనాల్లో పహడిషరిఫ్‌ పోలీస్ స్టేషన్‌కు మనోజ్ వెళ్లాడు. ఇందులో భాగంగా మోహన్‌బాబు, అతని అనుచరులపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన వారి వివరాలు మంచు మనోజ్ పోలీసులకు ఇచ్చాడు. అదే సమయంలో తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. అనంతరం హాస్పిటల్ రిపోర్టులను పోలీసులకు అందించాడు. ఈ మేరకు మెడికల్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. 

Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌! 

దీంతో మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవల ఎపిసోడ్ మరింత ఉదృతానికి దారితీసింది. మరి ఈ గొడవ ఎంత వరకు చేరుతుందో చూడాలి. ఇదిలా ఉంటే మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ముందు మోహన్ బాబుతో చర్చలు జరిగినట్లు తెలిసింది. అయితే ఆ చర్చల విషయంలో మనోజ్ సంతృప్తి చెందలేదని సమాచారం. అక్కడ వివాదం పరిష్కారం కాకపోవడంతో మనోజ్ పహడిషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!

రాజీ కుదుర్చడానికి వచ్చిన మంచు లక్ష్మి

మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. మోహన్ బాబు, మనోజ్ గొడవ విషయంలో రాజీ కుదుర్చడానికి ముంబై నుంచి వచ్చిన మంచు లక్ష్మి తిరిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంచు లక్ష్మీ.. మోహన్ బాబు, మనోజ్ మధ్య రాజీ ప్రయత్నాలు చేయగా విఫలమైనట్లు సమాచారం. ఆమె ఎంత సర్థి చెప్పడానికి ప్రయత్నించినా.. మనోజ్ మాత్రం తగ్గేదేలే అనే ధోరణిలో ఉన్నారట. దీంతో మంచు లక్ష్మి తన వల్ల కాదని.. హైదరాబాద్ నుంచి తిరిగి ముంబై వెళ్లిపోయినట్లు సమాచారం. 

Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!

ఏం జరిగిందంటే?

పలు నివేదికల సమాచారం ప్రకారం.. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గత కొంత కాలంగా ఈ ఆస్తుల వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు మనోజ్ తన వాటాపై మోహన్ బాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా తాజాగా మరోసారి జరిగిన చర్చల్లో మంచు మనోజ్ అడిగిన దానికి మోహన్ బాబు నిరాకరించడంతో.. వీరి మధ్య గొడవ వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది.

మధ్యలో తనకు మద్దతుగా వచ్చిన భార్య మౌనిక పై మోహన్ బాబు చేయి చేసుకున్నట్లు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మంచు కుటుంబం మరో సారి వార్తల్లో నిలిచింది. గాయాలతో వెళ్లి మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. మోహన్ బాబు కూడా మనోజ్ పై ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరి మంచు ఫ్యామిలీలో భగ్గుమన్న ఆస్తుల వివాదం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు