Maharashtra: రాజ్ తో చేతులు కలిపేందుకు ఉద్ధవ్ రెడీ!
రాజ్ ఠాక్రే తో చేతులు కలిపేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రకటించింది.బీజేపీకి , ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు దూరమైతేనే అందుకు రెడీ అంటూ ప్రకటించింది.
రాజ్ ఠాక్రే తో చేతులు కలిపేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రకటించింది.బీజేపీకి , ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు దూరమైతేనే అందుకు రెడీ అంటూ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు మహారాష్ట్రను కూడా తాకింది. ఈ అంశంపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు
మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో అనధికార సత్పీర్ బాబా దర్గా కూల్చివేత పెద్ద హింసకు దారి తీసింది. అక్రమంగా నిర్మించిన దర్గాను కూల్చివేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు.
మహారాష్ట్రలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫేర్వెల్ పార్టీలో విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదని ఓ రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అవయవాలు అమ్మి అప్పు తీర్చుకుటానని బోర్డు పట్టుకొని రోడ్డెక్కాడు. సతీశ్ తన కిడ్నీలు 75వేలు, కాలేయాన్ని 90వేలు, కళ్లు 25,000లకు అమ్మి అప్పు తీరుస్తానని చెబుతున్నారు.
మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తరువాత ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో దోమల పెంటవద్ద బస్సును కారు ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నారు.
స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు న్యాయస్థానం ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కుణాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఔరంగజేబు 300 ఏళ్ల క్రితం మరణిస్తే ఇప్పుడు సమాధి తవ్వాల్సిన అవసరం ఏంటని ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారు. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే.. ఎన్డీయేలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ను పిలవాలన్నారు.