/rtv/media/media_files/2025/03/20/n7hkIIGaayRI57C6WVyI.jpg)
Uddhav Thackeray and Chandra babu naidu
మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి చుట్టూ జరుగుతున్న రాజకీయ వివాదం దుమారం రేపుతోంది. నాగ్‌పూర్ మార్చి 17న జరిగిన హింసాత్మక ఘటనలో 34 మంది గాయాలపాలయ్యారు. అయితే తాజాగా ఈ నాగ్‌పూర్ ఘటనపై మాజీ సీఎం, శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు 300 ఏళ్ల క్రితం మరణిస్తే ఇప్పుడు సమాధి తవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే.. ఎన్డీయేలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కూడా పిలవాలని సూచనలు చేశారు.
Also Read: మద్యం తాగేవాళ్లకి వారానికి రెండు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి.. ఎమ్మెల్యే డిమాండ్
ఆంధ్రప్రదేశ్, బిహార్‌లో ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పరోక్షంగా చంద్రబాబు, నితీశ్‌కుమార్ పేర్లను ప్రస్తావించారు. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఆయన నితీశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావిచారు. ఈ నాగ్‌పూర్ హింసాత్మక ఘటన వెనుక ఎవరున్నారని మీడియా ఉద్దవ్‌ను ప్రశ్నించింది. దీని ఆయన స్పందిస్తూ.. '' ఈ హింస వెనుక ఎవరున్నారో సీఎంను అడగండి. ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. ఔరంగజేబు 300 ఏళ్ల క్రితం మరణిస్తే ఇప్పుడు సమాధి తవ్వాల్సిన అవసరం ఏంటి?. ఒకవేళ సమాధిని తొలగించాలని అనుకుంటే మీ మిత్రులు చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌ను కూడా ఆహ్వానించండని'' ఉద్దవ్ ఠాక్రే అన్నారు.
#WATCH | Mumbai: On Nagpur violence, Shiv Sena (UBT) chief Uddhav Thackeray says, "I am not the Chief Minister, nor am I the Home Minister, ask the Chief Minister who is behind this (violence). Because the RSS headquarters is there. There is a double-engine government here; if… pic.twitter.com/VUTg58l7E9
— ANI (@ANI) March 18, 2025
Also Read: వినియోగదారులకు అలర్ట్....నాలుగు రోజులు బ్యాంక్ లు బంద్
ఇదిలాఉండగా.. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల ఛావా సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఔరంగజేబు శంభాజీని ఎలా చిత్రహింసలకు గురిచేసి అత్యంత క్రూరంగా ప్రాణాలు తీశారో చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత ఔరంగజేబుపై మరాఠాలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఔరంగజేబు సమాధీని ధ్వంసం చేస్తామని ఓ వర్గం హెచ్చరించింది. దీంతో ఇది నాగ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నాగ్‌పూర్ హింసపై డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే కూడా శాసనమండలిలో ప్రసంగించారు. మరోవైపు ఔరంగజేబు అత్యంత క్రూరమైన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ప్రజల్లోకి వెళ్లాలంటే....గన్ లెసెన్స్ ఇవ్వండి...పోలీసులకు ఆ ఎమ్మెల్యే లేటర్..