/rtv/media/media_files/2025/04/22/ICsAujHt14qohYZv3s17.jpg)
uddav
బీజేపీకి , ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే దూరమైతే ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధమేనని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రకటించింది. దూరమైపోయిన ఇద్దరు సోదరులు తిరిగి దగ్గరకు వస్తారన్న ఆలోచనే మహారాష్ట్ర ప్రయోజనాలను వ్యతిరేకంగా పని చేస్తున్న వర్గాలకు ఆందోళన కలిగిస్తోందని ఆ పార్టీ పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది.
Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
దాదాపు రెండు దశాబ్దాల క్రితం వేరు పడిపోయిన ఉద్ధవ్ , రాజ్ ఠాక్రేలు ఇటీవల గతం మరిచి తిరిగి ఒకటి కావాలన్న ఆకాంక్షను వెల్లడిస్తూ పత్రికా ప్రకటనలు వెలువరించారు.మహారాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న వారిని దూరం పెడితే రాజ్ ఠాక్రేతో తనకున్న చిన్న చిన్న విభేదాలను విస్మరించడానికి తాను సిద్ధమని ఉద్ధవ్ ప్రకటించారు.
Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
Uddhav Join Hands With Raj
మరో వైపు ఉద్ధవ్ ఠాక్రే పై ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తీవ్ర విమర్శలు చేసింది. ఆయనో అభినవ దుర్యోధనుడని పేర్కొంది. బాల్‌ఠాక్రే స్థాపించిన పార్టీలో రాజ్‌ఠాక్రేను ఆయన ఎదగనివ్వలేదని ఆరోపించింది.శివసేన అధికార ప్రతినిధి,ఎంపీ నరేశ్ మష్కే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
క్షీణిస్తున్న పార్టీని కాపాడుకోవడంలో భాగంగానే ఉద్ధవ్ ఠాక్రే ఈ చర్యలుచేపట్టారని విమర్శించారు. యూబీటీ వర్గంలో జనాలను ఆకట్టుకునే నేత లేడు.దీంతో వారు రాజ్ ఠాక్రే వైపు మొగ్గు చూపిస్తున్నారు. లోక్ సభ,రాజ్య సభలో పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.ఇక ఉద్ధవ్ ఠాక్రే అభినవ దుర్యోధనుడు .పార్టీలో రాజ్ ఠాక్రేకు కీలక బాధ్యతలు అప్పగించాలని బాలాసాహెబ్ కోరినా..ఆయనను పార్టీలో ఎదగనివ్వలేదు అని ఆరోపించారు.
Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
maharashtra | politics | uddav-takrey | latest-news