/rtv/media/media_files/2025/05/20/NrpJQmgnOtiv5bobo2aD.jpg)
corona-virus
Covid-19 Cases: కరోనా కేసుల పెరుగుదలే ఆందోళనకరమంటే ముంబైలో కరోనా సోకిన ఇద్దరు తాజాగా మృతి చెందడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో 14ఏళ్ల బాలుడు, 54ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందారు. అయితే వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఒకరు నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారణంగా 14 ఏళ్ల బాలుడు, మూత్రపిండాలు కారణంగా 54 ఏళ్ల క్యాన్సర్ రోగి మృతి చెందారు. ఈ నెల 19నాటికి దేశంలో 257 యాక్టివ్ కొవిడ్ కేసులున్నాయి. కేరళ 95 యాక్టివ్ కేసులతో ముందంజలో ఉంది. అంతేకాకుండా ఓ మరణం కూడా నమోదైంది.
Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!
Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!
మహారాష్ట్రలో 44 , తమిళనాడులో 34 కేసులు
మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం మహారాష్ట్రలో 90% కంటే ఎక్కువ COVID-19 కేసులు మే నెలలోనే నమోదయ్యాయి. మే 12 మరియు మే 18 మధ్య మాత్రమే రాష్ట్రంలో 53 కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి, మహారాష్ట్రలో మొత్తం 87 కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాలలో కర్ణాటక (8), గుజరాత్ (6), ఢిల్లీ (3), హర్యానా, రాజస్థాన్, సిక్కింలలో ఒక్కొక్క కేసు నమోదు అయింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల భారత్ తో కూడా కేసుల పెరుగుదలను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సంబంధిత లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు సూచించారు.
Covid-19 Cases | maharashtra | kerala | telugu-news