Election Results: మహారాష్ట్రలో బీజేపీ, మహాయుతి గెలుపుకు కారణాలు ఇవే..
ఈసారి గెలవడం కష్టమే అనున్న ప్రతీసారీ బీజేపీ విక్టరీలు సాధిస్తోంది. మొన్న హరియాణా, ఈరోజు మహారాష్ట్ర...రెండు చోట్లా ఢంకా బజాయించింది. దీని వెనుక కారణాలు ఏంటి? మహారాష్ట్రలో మహాయుత, బీజేపీ అనురించి వ్యూహాలు ఏంటి?
మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం ఖాయమనైన నేపథ్యంలో.. కొత్త సీఎం ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవి కోసం ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవర్ పోటీ పడుతున్నారు. BJP హైకమాండ్ మరో కొత్త పేరు తెరమీదకు తెచ్చే అవకాశం కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది.
Eknath Shinde: నేనే సీఎం.. షిండే సంచలన ప్రకటన
మహారాష్ట్రలో సీఎం మార్పు ఉండకపోవచ్చని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది భారీ విజయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మానియా.. దీనవ్వ తగ్గేదే లే!
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్తా చాటారు. ఆయన ప్రచారం నిర్వహించిన షోలాపూర్, డెగ్లూర్లో బీజేపీ అభ్యర్థులు విజయపథంలో కొనసాగుతున్నారు. దీంతో పవన్ సౌతిండియాలో బీజేపీ బ్రహ్మాస్త్రంలా దొరికారంటూ చర్చించుకుంటున్నారు.
మహారాష్ట్రలో సీన్ రివర్స్.. హంగ్ వచ్చే ఛాన్స్
మహాయుతి కూటమి 139 స్థానాల్లో దూసుకుపోతుంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 135 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 14 స్థానాల్లో దూసుకుపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే్ అక్కడ హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.