Election Results: మహారాష్ట్రలో బీజేపీ, మహాయుతి గెలుపుకు కారణాలు ఇవే.. ఈసారి గెలవడం కష్టమే అనున్న ప్రతీసారీ బీజేపీ విక్టరీలు సాధిస్తోంది. మొన్న హరియాణా, ఈరోజు మహారాష్ట్ర...రెండు చోట్లా ఢంకా బజాయించింది. దీని వెనుక కారణాలు ఏంటి? మహారాష్ట్రలో మహాయుత, బీజేపీ అనురించి వ్యూహాలు ఏంటి? By Manogna alamuru 23 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి బీజేపీ దాని అనుసంధాన పార్టీలు తమ వ్యూహాలను మార్చాయి. జాతీయతను పక్కన పెట్టి స్థానికతను ఒంటబట్టించుకున్నాయి. ఎక్కడ గెలుపు కావాలో అక్కడే లోకల్ అనిపించుకోవాలని డిసైడ్ అయింది. దానికి తగ్గట్టే తమ ఐడియాలను అమలుపర్చుకుంటూ వెళ్ళింది. జాతీయ అంశాలను తాయిలాలుగా చూపించడం మానేసింది. ఇది చాలా పెద్ద స్ట్రేటజీ ఎన్డీయేకు. ఇప్పుఉ ఇదే దీనికి ఇజయాలను కట్టబెడుతోంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తోంది. మాదీ సంక్షేమ ఎజెండానే అంటూ ఉచిత హామీలను గుప్పిస్తోంది చిన్న పార్టీలనూ కలుపుకుంటూ...చిన్న ఊళ్ళపై కూడా దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో.. అసాధ్యం అనుకున్న రాష్ట్రాల్లోనూ విజయాలతో దూసుకెళుతోంది. మొన్న హరియాణా...ఈరోజు మహారాష్ట్రల్లో అలాగే పట్టు సాధించింది. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీకి గట్టి దెబ్బ తగిలింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని రిపీట్ చేయకూడదని భావించింది. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రూపొందించింది. అయోధ్య, 370 రద్దు లాంటి విషయాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. కేవలం స్థానిక అంశాలపైనే ఫోకస్ చేసింది. అందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎదురైన మహారాష్ట్ర ప్రాంతంలో ఉల్లి రైతుల నుంచి వ్యతిరేకతపై దృష్టి పెట్టింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించింది. ఇతర రైతుల్లో ఉన్న వ్యతిరేకతనూ చల్లార్చుకుని పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ వంటివి ప్రకటించింది.అలాగే...మహారాష్ట్ర ఎన్నికల ముందు లడ్కీ బెహన్ యోజన పేరుతో కూటమి సర్కారు చేపట్టిన నగదు బదిలీ పథకం కూడా ఆ పట్ల మధ్యతరగతిలో సానుకూలత తెచ్చిపెట్టింది. Also Read: MH: మనిషే కామ్..పని మాత్రం స్ట్రాంగ్...మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం శిండే? ఫలించిన నేతల కష్టం... ఇక మమారాష్ట్రలో గెలుపు కోసం కీలక నేతలందరూ కష్టపడ్డారు. ప్రధాని మోదీ దగ్గర నుంచీ మహారాష్ట్ర ప్రధాన నేతలందరూ ప్రజలను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నించారు. మహాయుతిలో ఉన్న కీలక నేతలందరూ కలిసి మమహారాష్ట్ర లో విజయం కోసం పాటు పడ్డారు. మోదీ.. మహారాష్ట్రలో ప్రధాని మోదీ 10 ప్రచార సభల్లో పాల్గొన్నారు. మొత్తం 106 నియోజకవర్గాలను కవర్ చేశారు. ఎప్పటిలానే తన మాటలతో విపక్షాల మీద విరుచుకుపడడమే కాకుండా లోకల్ అంశాలపైన మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమాలను హైలెట్ చేశారు. అమిత్ షా.. మహారాష్ట్ర ఎన్నికల్లో అమిత్ షా తన ట్రేడ్ మార్క్ వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. 38 నియోజకవర్గాలను కవర్ చేసేలా 16 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. మహాయుతి సందేశం రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకు చేరేలా ప్రచార వ్యూహాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇది కూడా చూడండి: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు? నడ్డా... మహారాష్ట్రలో నడ్డా మిత్రపక్షాలను సమన్వయం చేసిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎన్నికల్లో ఆయన అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు. తన అనుభవాలన్నింటినీ కలిపి కొట్టి విజయం దిశగా పురుగులు పెట్టించారు. ఫడ్నవీస్... శిండే నాయకత్వంలో డిపయూటీ సీఎంగా ఉన్న దేవంద్ర ఫడ్నవీస్...ఎన్డీయే కూటమిలో అతి కీలకమైన వ్యక్తి. మంచి మాటకారి. ఎన్నికల ప్రచారంలో దీంతోనే ఆయన దూసుకెళ్ళిపోయారు. మహారాష్ట్రలో ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో ఫడ్నవీస్ మాటలు బాగా పని చేశాయి. ఏక్‌నాథ్ శిండే... ఈయన మాట్లాఇంద తక్కువే. తానేంటో తన పని ద్వారానే ప్రజలకు తానేంటో చాటి చెప్పారు. ఒక మరాఠాగా మహారాష్ట్రకు తానేం చేయగలనో చేసి చూపించారు. ఇప్పుడు మహాయుతి మళ్ళీ పగ్గాలు చేపట్టాడానికి రెడీ అవడానికి అతి పెద్ద ముఖ్య కారణం శిండే. ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా? గడ్కరీ... విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో సవాళ్లు ఎదుర్కొంటున్న మహాయుతికి అపూర్వ విజయం తెచ్చిపెట్టడంలో వెనుక కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కృషి చెప్పుకుని తీరాల్సిందే. 72 ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న నితిన్ గడ్కరీ.. ఈ ప్రాంతాల్లో గేమ్ ఛేంజర్‌లా నిలిచారు. అట్టడుగు వర్గాల్లో ఆయన పట్ల సానుకూలత, మౌలికవసతుల అభివృద్ధిపై దృష్టిసారించడం వంటి అంశాలు ఈ ప్రాంతంలో మహాయుతికి అనుకూలించాయి. అజిత్ పవార్.. మహాయుతిలో అందరికన్నా మోస్ట్ సీనియర్ నేత. ఎన్సీపీ నుంచి చీలిపోయి ఎన్డీయే కూటమిలో కలిశారు. ఈయన రాజకీయ చతురత గురించి తెలనిది ఎవరికి. ఎన్నో ఏళ్ళుగా చేసుకుంటూ వస్తున్నదే ఇప్పుడు కూడా చేసి చూపించారు. మహారాష్ట్రల తనకు ఎదురులేదని నిరూపించారు. Also Read: MH: హమ్మయ్య ధారావి ప్రాజెక్టు సేఫ్...ఆదానీకి కాస్త ఊరట ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు! #maharashtra election 2024 #election-results-2024 #maharastra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి