Eknath Shinde: నేనే సీఎం.. షిండే సంచలన ప్రకటన

మహారాష్ట్రలో సీఎం మార్పు ఉండకపోవచ్చని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది భారీ విజయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

New Update
rerer

మహారాష్ట ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి విజయం ఖాయమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం, శివసేన నేత ఏక్ నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. సీఎం మార్పు ఉండకపోవచ్చన్నారు. ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారీ విజయమన్నారు. మాకు అన్ని వర్గాల ఓట్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. మహాయుతీ సైనికులంతా పట్టుదలతో పనిచేశారని కొనియాడారు. గతంలో ఎన్నడూ నమోదు కాని విజయాన్ని వారు మనకు అందించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని షిండే అభిప్రాయపడ్డారు. 

సీఎం పదవిపై..

ఎక్కువ సీట్లు వచ్చిన వారికి సీఎం పదవి ఇచ్చే ఆలోచన లేదని అన్నారు. తుది ఫలితాలు వచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి కూర్చుని సీఎం పదవిపై చర్చించుకుంటాయన్నారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డాతో పాటు అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

Maharashtra Elections 2024

ఇది కూడా చదవండి:  ఖాళీ కడుపుతో ఈ కషాయం తాగితే మీ గుండె సేఫ్‌

Also Read :  వయనాడ్‌లో లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ

ఇది కూడా చదవండి:  చలికాలంలో పొడిబారిన చర్మ సమస్య ఇలా పోతుంది

Also Read : బుమ్రా దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు గజగజ.. 104 ఆలౌట్!

#maharashtra election 2024 #eknath-shinde #maha-yuti
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు