మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మానియా.. దీనవ్వ తగ్గేదే లే!

మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్తా చాటారు. ఆయన ప్రచారం నిర్వహించిన షోలాపూర్, డెగ్లూర్‌లో బీజేపీ అభ్యర్థులు విజయపథంలో కొనసాగుతున్నారు. దీంతో పవన్ సౌతిండియాలో బీజేపీ బ్రహ్మాస్త్రంలా దొరికారంటూ చర్చించుకుంటున్నారు.

New Update

మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ దూసుకుపోతోంది. పవన్ ప్రచారం నిర్వహించిన షోలాపూర్, డెగ్లూర్ లో బీజేపీ హవా కనబరుస్తోంది.

పవన్ మానియా

ఈ నెల 16, 17 తేదీల్లో మహాయుతి తరఫున పవన్ కళ్యాణ్.. బల్లార్‌పూర్‌, డెగ్లూర్‌, పుణె, లాతూర్‌, షోలాపూర్‌‌లో ప్రచారం చేయగా.. బల్లార్‌పూర్, పుణె, షోలాపూర్‌లో బీజేపీ ముందంజలో పరుగులు పెడుతోంది.  పవన్ ప్రచారం చేసిన అభ్యర్థులు విజయపథంలో కొనసాగుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సౌతిండియాలో బీజేపీ బ్రహ్మాస్త్రంలా దొరికారంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారం!

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమికి బిగ్ షాక్ తగిలింది. మహయుతీ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాయుతి కూటమి 152 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహా వికాస్ అఘాడి 120 సీట్లలోనే మెజార్టీలో కొనసాగుతోంది. దీన్ని బట్టి చూస్తే.. మహాయుతి కూటమి మహారాష్ట్రంలో అధికారం సాధించినట్లేనని స్పష్టమవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు