Lucknow : పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్ పై అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

New Update
teacher

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు(teacher) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  నిందితుడు ఆశిష్ కుమార్ సీతాపూర్‌లో లివ్-ఇన్ అరేంజ్‌మెంట్ కోసం తనను బలవంతం చేశాడని, ఆ సమయంలో అతను పదే పదే లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని కూడా ఆమె ఆరోపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆశిష్ కుమార్ తో బాధితురాలికి సీతాపూర్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆశిష్ తనను తాను ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకుని, వారి సంభాషణల సమయంలో పెళ్లి ప్రతిపాదన చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఆశిష్ ఆమెతో సహజీవనం చేశాడు. బాధితురాల తన భర్త నుండి విడిపోయితన ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచుతుంది.  అయితే ఆశిష్ ఇటీవల ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీనితో బాధితురాలు అతడితో పెళ్లి విషయం గురించి అడిగినప్పుడు, అతను వివాహానికి నిరాకరించాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారి తెలిపారు.. పోలీసులు ఆశిష్ పై  సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది. 

Also Read :  భార్య అక్రమ సంబంధం.. తట్టుకోలేక బిడ్డకు విషం ఇచ్చి తండ్రి సూసైడ్

స్నేహితుడితో కలిసి ఆమె భర్తపై

ఇక మరో ఘటనలో ఓ మహిళతో అక్రమ సంబంధం(Illegal Affair) పెట్టుకున్న వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడగా తనను చంపించడానికి ప్రోత్సహించింది తన భార్యనే అని తెలిసి అవాక్కవడం ఆ భర్త వంతయింది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం లింగాయిపల్లి గ్రామానికి చెందిన దేశబోయిన భూపాల్‌ అనే యువకుడితో కామారెడ్డికి చెందిన చంద్రకళ(23)కు ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది. ప్రస్తుతం వీరిద్దరూ కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లో కాపురం ఉంటున్నారు.అయితే చంద్రకళకు పెళ్లికి ముందే ఆమె సొంత గ్రామానికి చెందిన దుర్గయ్య(26) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తరచూ ఇద్దరు కలుసుకునేవారు.

దీనికోసం బ్యాచిలర్ అయిన దుర్గయ్యను వారింటికి పక్క వీధిలోని అద్దె ఇంట్లో ఉంచింది. అయితే దుర్గయ్యతో చంద్రకళకు ఉన్న సంబంధం గురించి  భూపాల్‌ కు తెలిసింది. ఈ విషయమై భూపాల్‌ పలుమార్లు భార్యను హెచ్చరించాడు.ఈ క్రమంలో భూపాల్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్న చంద్రకళ ప్లాన్‌ ప్రకారం మంగళవారం ఉదయం ఇళ్లల్లో పనిచేయడానికి వెళ్లగా.. భూపాల్‌ ఇంట్లో ఒకడే ఉన్నాడు. ముఖానికి మాస్కులు ధరించిన దుర్గయ్య, అతని స్నేహితుడు భరత్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న భూపాల్‌ను కిందపడేసి ఇష్టం వచ్చినట్లు కొట్టడంతోపాటు మర్మాంగంపై తన్నారు. అతని మెడను కాళ్లతో తొక్కి చంపేందుకు ఆ ఇద్దరు ప్రయత్నించారు. వారి దెబ్బలకు బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే భూపాల్‌కు తన భార్యపై అనుమానం రావడంతో అదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  తన భార్యతో వివాహేతర సంబంధం(illegal-relationship) పెట్టుకోవడంతోపాటు తనపై దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Also Read :  దసరా సెలవులకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు.. ఒళ్ళు గొగ్గుర్పుడిచే యాక్సిడెంట్!

Advertisment
తాజా కథనాలు