/rtv/media/media_files/2025/04/08/WErn59W7ZYE2pbYBGfEq.jpg)
Shopkeepers Attack On Devotees
Lucknow Chandrika Devi Temple : చాలామందికి దేవుడి మీద భక్తి ఉంటుంది. వారికున్న భక్తి మేరకు దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఇక దైవ సన్నిధికి వెళ్లినపుడు ఉట్టి చేతులతో రాకూడదని ప్రసాదాలు, కంకణాలు వంటివి కొనక్కు వస్తుంటారు. అయితే ఇదంతా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఉంటే కొంటాం లేదంటే లేదు.కొన్ని సమయల్లో పరిస్థితులను బట్టి కూడా ప్రసాదాలు కొంటె కొంటాం లేదంటే కొనం. కానీ లక్నోలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు ప్రసాదాలు కొనలేదని వారిపై అక్కడి దుకాణాదారులు దాడికి పాల్పడ్డారు. భక్తులు ప్రసాదం కొనుగోలు చేయలేదని.. కోపంతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. బెల్టులు, చెప్పులతో దాడి చేశారు. ఫలితంగా వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
ఉత్తర ప్రదేశ్ లక్నోలోని బక్షి కా తలాబ్ పరధిలో చంద్రికా దేవి ఆలయం ఉంది. ఈ గుడికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని.. లక్నోలోని త్రివేణీ నగర్‌కు చెందిన పియూష్ శర్మ, అతడి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్న ఆయన తిరిగి బయటకు వచ్చాడు. ఈక్రమంలోనే స్థానికంగా ఉన్న దుకాణాదారులు.. తమ దుకాణాల్లో ప్రసాదం కొనుగోలు చేయమని వెంట పడ్డారు. కానీ వారు ప్రసాదం కొనేందుకు ఆసక్తి చూపలేదు.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
పదే పదే వెంట పడటంతో.. పియూష్ శర్మ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి సూచించారు. ఎంత బతిమాలుతున్నా వారు ప్రసాదం కొనకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుకాణాదారులు అతడిని తిట్టడం ప్రారంభించారు. ఈక్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆరుగురు దుకాణాదారులు ఏకమై.. పియూష్ శర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. చెప్పులు, బెల్టులతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. పియూష్ శర్మను కొడుతుండడంతో.. ఆయన కుటుంబంలోని మహిళలు సైతం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ దుకాణాదారులు మాత్రం వారిని కూడా కొడుతూ రచ్చ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా తోసేశారు. ఫలితంగా పియూష్ శర్మ సహా ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సదరు దుకాణాదారులపై ఫిర్యాదు చేశారు. ప్రసాదం కొనలేదని వారంతా తమను విపరీతంగా కొట్టినట్లు వివరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుకాణాదారులపై కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు దుకాణాదారులు భక్తులపై దాడి చేస్తుండగా పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. ప్రసాదం కొనలేదనే చిన్న కారణంతో ఇంత దారుణంగా కొట్టడం ఏమాత్రం బాగాలేదని కామెంట్టు చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఆలయం ప్రాంగణంలో వారు దుకాణం కూడా పెట్టుకోకుండా చూడాలని అంటున్నారు. ఇలా చేస్తేనే భవిష్యత్తుల్లో మరే భక్తుడిపై దాడి జరగదని వివరిస్తున్నారు.
Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు
बीकेटी स्थित चंद्रिका देवी मंदिर पर दर्शन करने आए महिला व पुरुष श्रद्धालुओं को...मेला दुकानदारों ने जमकर पीटा..श्रद्धालु हुए चोटिल..पुलिस कर्मी नदारद..🙄..आए दिन श्रद्धालुओं से की जाती है..बदसलूकी..@LkoCp
— Vivek Sharma (@Lko_VivekSharma) April 7, 2025
मामला रफादफा करने में जुटे..चौकी प्रभारी..@lkopolice
जनहित में उक्त… pic.twitter.com/1oCycg98wE