/rtv/media/media_files/2025/07/22/manoj-murder-2025-07-22-17-52-37.jpg)
తన తల్లిని కొట్టాడనే కోపంతో ఓ యువకుడు అతన్ని వెతికి మరి హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. లక్నోలోని ఇందిరా నగర్‌లో 22 ఏళ్ల కొబ్బరి నీళ్లు అమ్మే వ్యక్తిని కొట్టి చంపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు పదేళ్ల క్రితం జరిగిన ఓ వివాదంలో మనోజ్, సోను తల్లిని కొట్టాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. దీంతో తన తల్లిని కొట్టిన అతన్ని వదలకూడదని సోను కసితో రగిలిపోయాడు. అతడికోసం పదేళ్లుగా వెతుకుతున్నాడు. మూడు నెలల క్రితం మనోజ్ మున్షిపులియా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన సోను తన ఫ్రెండ్స్ తో కలిపి అతన్ని హత్య చేసేందుకు స్కెచ్ వేశాడు. మనోజ్ ను హత్య చేస్తే మంచి పార్టీ ఇస్తానని ఒప్పించాడు.
Also Read : 'నెక్ట్స్ ఉపరాష్ట్రపతి నితీష్.. సీఎం పదవికి రాజీనామా!'
Also Read : Gandikota Girl: తల్లే విలన్!.. గండికోట యువతి హత్య కేసులో షాకింగ్ నిజాలు!
మనోజ్ ఒంటిరిగా ఉన్న టైమ్ లో
అందుకు సోను ఫ్రెండ్స్ రంజిత్, ఆదిల్, సలామ్, రెహ్మత్అలీ కూడా సరేనన్నారు. మనోజ్ ఒంటిరిగా ఉన్న టైమ్ లో అతడిని ఇనుప రాడ్‌లతో తీవ్రంగా కొట్టి పారిపోయారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనోజ్ మృతి చెందాడు. హత్య అనంతరం వారు పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన ఐదుగురు అనుమానితులలో ఒకరిని సోషల్ మీడియా ఫోటోలలో ఉన్నట్లుగా గుర్తించారు. మరింత వెతికితే అతని సోషల్ మీడియా ప్రొఫైల్స్ కనిపించాయి. హత్య సమయంలో అతను ధరించిన నారింజ రంగు టీ-షర్టునే సోషల్ మీడియాలో ధరించి కనిపించాడు. దీంతో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : UAE : దారుణం.. బర్త్‌డే రోజునే భర్త చంపేశాడు...గొంతుకోసి!
Also Read : POKలో తిరగబడ్డ పోలీసులు.. పాకిస్తాన్ కు ఇది మామూలు దెబ్బ కాదు!
UP crime | Uttar Pradesh | manoj | Sonu Kashyap | lucknow