/rtv/media/media_files/2025/09/14/indigo-flight-2025-09-14-13-06-07.jpg)
indigo flight
Indigo flight : ఇటీవల వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. పలు విమానాలు గమ్యానికి చేరకముందే ప్రమాదాలకు గురవ్వడం లేదంటే రద్దు కావడం సాధాణమై పోయింది. ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి ఎదురైంది. అయితే ఆ విమానంలో ఒక మాజీ సీం సతీమణి ఉండటం కలకలం రేపింది. మిమానయాన సంస్థ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..
ఇది కూడా చూడండి:ఇదేం ట్రాఫిక్ రా బాబు.. హైటెక్ సిటీ ఏరియాలో వాహనాలు ఎలా ఆగాయో చూడండి-PHOTOS
లక్నో నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం (Indigo flight) 6E 2111, టేక్ ఆఫ్ సమయంలో ఇంజిన్ లో లోపాలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. కాగా ఈ విమానంలో మొత్తం 151 మంది ప్రయాణికులు ఉండగా వారిలో సమాజ్‌వాది పార్టీ ఎంపీ, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. గాల్లోకి ఎగిరేందుకు సిద్ధమైన ఇండిగో విమానం రన్ వే పై పరిగెత్తుతున్న సమయంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానం టేక్ ఆఫ్ రద్దు చేయాల్సి వచ్చిందని ప్రకటించారు.
ఇది కూడా చూడండి:TG-AP Rains: తెలంగాణ, ఏపీకి రెయిన్ అలర్ట్.. డేంజర్‌లో ఉన్న జిల్లాలివే!
ఇంజిన్ సరైన శక్తిని ఉత్పత్తి చేయకపోవడాన్ని గమనించిన Pilot ఎమర్జెన్సీ బ్రేక్‌లను ఉపయోగించి విమానాన్ని రన్‌వే చివరి ప్రాంతానికి చేరకముందే విమానాన్నినిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ షాకింగ్ ఘటన చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.. ఆ సమయంలో విమానంలో ఉన్న ఎంపీ డింపుల్ యాదవ్ తో పాటు ప్రయాణికులు కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే ఇంజనీర్లు చాలాసేపు విమానాన్ని పరిశీలించినప్పటికీ, సరిగ్గా ఎటువంటి సాంకేతిక లోపం ఏర్పడిందో వెంటనే గుర్తించలేకపోయారు. దీంతో టేక్ ఆఫ్ రద్దైన తర్వాత, డింపుల్ యాదవ్ సహా అందరూ ప్రయాణికులను సురక్షితంగా మరొక ఢిల్లీ వైపు వెళ్లే విమానం లోకి పంపించారు. కాగా ఇండిగో విమాన సంస్థ ఈ వైఫల్యానికి ప్రయాణీకులకు క్షమాపణ తెలిపింది.
Also Read : Liquor smuggle: వాటే థాట్.. పిచ్చోళ్లు అయిపోవాల్సిందే.. ఒంటెలపై మద్యం అక్రమ రవాణా