/rtv/media/media_files/2025/05/15/SSs2ZpmL50FOtA2FkBNI.jpg)
Bus Fire Accident
Bus Fire Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ర్టంలోని లక్నోలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లక్నోలోని మొహన్‌లాల్‌గంజ్ సమీపంలో గల కిసాన్‌పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సులో సడెన్‌గా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజాము సమయం కావటంతో ప్రయాణికుల్లో చాలా మంది నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదం జరగడంతో ఐదుగురు మరణించారు.
VIDEO | As many as five passengers have died after a bus caught fire on Kisan Path in Mohanlalganj area of Lucknow. The bus was going from Bihar to Delhi. More details awaited.
— Press Trust of India (@PTI_News) May 15, 2025
(Source: Third Party)#Lucknow #UttarPradesh #busaccident pic.twitter.com/HOVQrsZD4h
ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా పొగ వ్యాపించడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. భయాందోళనతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. దీన్ని గమనించిన స్థానికులు, ప్రయాణికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. బస్సులో డోరు వైపు ఉన్నవారు త్వరగానే బయటకు రాగలిగారు కానీ, వెనుకవైపు ఉన్నవారికి ఎమర్జెన్సీ డోరు తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయారు.
ఇది కూడా చూడండి: RRR 2: చరణ్, తారక్.. జక్కన్నను ఎలా ఆటపట్టించారో చూడండి.. RRR 2 పై రాజమౌళి రియాక్షన్! (వీడియో)
అలాగే డ్రైవర్ సీటుకు సమీపంలో అదనంగా సీటు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. దీంతో మంటలు ఎగిసిపడి ప్రయాణికులు గాయపడ్డారు.అగ్ని ప్రమాదం మొదలైన 10 నిమిషాల్లోనే మొత్తం బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదం సంభవించిన వెంటనే బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సు నుంచి దూకి పరారయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. చాలా సేపు శ్రమించి మంటలను అదుపు చేసినప్పటికీ ఐదుగురు సజీవదహనం కావడం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్