GT vs LSG: లఖ్‌నవూ భారీ స్కోర్.. మార్ష్‌ రికార్డ్ సెంచరీ, దంచికొట్టిన పూరన్!

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌ వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 235/2 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 117, పూరన్ 56* రన్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించారు. 

New Update
lsg ipl

IPL 2025 Lucknow huge score against Gujarat Titans

GT vs LSG: అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 235/2 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 117, పూరన్ రన్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించారు. 

ఓపెనర్ మార్కరమ్, మార్ష్ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించారు. తొలి ఓవర్ నుంచే లఖ్ నవూ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సులు, ఫోర్లలో స్టేడియాన్ని హోరెత్తించారు. మార్కరమ్ 24 బంతుల్లో 3ఫోర్లు 2 సిక్సులతో 36 పరుగులు చేశాడు.

మార్ష్  64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సులతో 117 రన్స్ చేశాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.  27బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 56 పరుగులు చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 6 బంతుల్లో 2 సిక్సరల్లో 16 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 1, సాయి కిషోర్ 1 వికెట్ తీశారు. 

gujarath | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు