Rishab Pant: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా పంత్
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను నియమిస్తున్నట్లు ఆ ఫాంఛైజీ తెలిపింది. గతేడాది నవంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం జరిగింది. ఇందులో పంత్‌ను లక్నో రూ.27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు రిషబ్‌ను సొంతం చేసుకుంది.