/rtv/media/media_files/2025/06/16/0tmbkQFD1qtlZqM7r5Wf.jpg)
Saudi airlines
Saudi Airlines: వరుస విమాన ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఇటీవల గుజరాత్ అమ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి మరవకముందే వరుసగా హెలికాప్టర్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాగా హజ్ యాత్రికులతో లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 250 మంది యాత్రికులున్నారు.
Also Read: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. మహారాష్ట్ర పౌరులను అవమానించారన్న సీఎం
జెడ్డా నుంచి బయలుదేరిన సౌదీ ఎయిర్‌లైన్స్ యాత్రికుల విమానం ఆదివారం ఉదయం లఖ్‌నవూలోని అమౌసి విమానాశ్రయంలో కొంత సేపు నిలిపారు. ఆ తర్వాత టాక్సీ మార్గంలో వెళ్తుండగా విమానం ఎడమటైరు నుంచి దట్టమైన పొగలు, నిప్పురవ్వలు ఎగిసిపడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విషయాన్నిపైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు తెలియజేశారు.
Also Read:ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!
సమాచారం అందుకున్న సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పారు. అనంతరం ప్రయాణీకులను విమానం నుంచి సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారికి మరో విమానం ఏర్పాటు చేసేందుకు సౌదీ ఎయిర్ లైన్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. వారిని ఎంతసమయానికి గమ్యానికి చేరుస్తారనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
హైడ్రాలిక్ లీక్ కారణంగా చక్రంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV 3112 విమానం శనివారం రాత్రి 10.45 గంటలకు జెడ్డా నుంచి 250 మంది హజ్ యాత్రికులతో లక్నోకు బయల్దేరింది. ఆదివారం ఉదయం లక్నో విమానశ్రయానికి చేరుకోగానే ల్యాంగింగ్ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. విమానాన్ని టక్సీవేకు తరలిస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది నురుగు మరియు నీటిని ఉపయోగించి 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హైడ్రాలిక్ లీక్ కావడం వల్లే వీల్ చక్రం హీటెక్కినట్లుగా గుర్తించారు. టేకాఫ్ సమయంలో ఈ సమస్య జరిగి ఉంటే తీవ్రమైన ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు వెల్లడించారు.