BIG BREAKING: కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొత్త పదవులు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీలకు AICC ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ ఎఫైర్ కమిటీ, క్రమ శిక్షణా కమిటీలకు సభ్యులు, చైర్మన్లు నియమించింది ఏఐసీసీ. రాష్ట్రంలో మొదటి సారి 15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశారు.
కవితకు రేవంత్ కీలక పదవి? | Congress Key Post To Kavitha?| CM Revanth Reddy | KCR | Telangana | RTV
KTR: సీటుకు రూటు కుంభకోణం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు!
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీ పెద్దలకు దానం చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణంగా మారిందన్నారు. మూటల ముఖ్యమంత్రిగా మారిన రేవంత్.. హెరాల్డ్ కేసుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
TG Formation Day 2025: పండుగను తలపించేలా.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సర్కార్ కీలక ఆదేశాలు!
జూన్ 2న పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రతీ శాఖ నుంచి ఒక నోడల్ అధికారి నియమించి సమన్వయంతో పని చేయాలన్నారు. ఏర్పాట్లపై ఈ రోజు సీఎస్ సమీక్షించారు.
TG News: 5 లక్షల మందికి ‘రాజీవ్ యువవికాసం’.. 3 నెలల్లో యూనిట్లు, రూ.2 వేల కోట్లు ఖర్చు!
'రాజీవ్ యువవికాసం పథకం' అమలులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కల్పించే లక్ష్యంతో మొదట 5లక్షల మందికి జూన్ 2న రూ.4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
TG News: ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ప్రారంభించిన సీఎం.. 2.30 లక్షల రైతులకు పోడుపట్టాలు మంజూరు!
'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు పోడుపట్టాలు మంజూరు చేశారు. దీనికోసం రూ.600 కోట్లు ఖర్చుచేయనున్నారు.
BIG BREAKING: అగ్ని ప్రమాద బాధితులకు భారీ పరిహారం.. ఒక్కొక్కరికి ఎంతంటే!
ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు చెప్పారు.
TG News: 'తెలంగాణకు కృష్ణా నీటిలో 70% వాటా?'
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 70% వాటా వచ్చేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదించాలని సూచించారు. కృష్ణా బేసిన్లో 70% తెలంగాణలో, 30% మాత్రమే ఏపీలో ఉందన్నారు.