/rtv/media/media_files/2025/09/19/cm-revanth-2025-09-19-15-45-21.jpg)
Telangana to get 3000 Electric buses by 2027, Says CM Revanth Reddy
ఢిల్లీలో జరుగుతున్న ఇన్వెస్టర్స్ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడిచేలా చేస్తామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రైజింగ్ 2047 ప్లాన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ''2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యం. రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, ఇన్నోవేషన్ హబ్‌లు, ఫ్యూచర్ రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం లాంటివి ప్రాధాన్యంగా ఉంటాయి.
Also Read: దసరా గిఫ్ట్.. భారీగా తగ్గిన పాలు, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీం ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే!
మెట్రో రైలు వ్యవస్థను కూడా మరింతగా విస్తరిస్తున్నాం. దేశంలో చూసుకుంటే తెలంగాణలోనే అత్యుత్తమ మెట్రో ఉంది. మౌలిక రంగాల కల్పనలో కూడా తెలంగాణ పురోగతి సాధిస్తోంది. త్వరలో మూసీ రివర్ ఫ్రంట్ కూడా రానుంది. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. 2027 నాటికి హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడిచేలా చేస్తాం. రాష్ట్రంలో ప్రైవేట్ రంగం సహకారం కూడా అవసరమే. PAFI లాంటి సంస్థలు కూడా ఇలాంటి మార్గదర్శక ప్రణాళికల్లో భాగస్వామ్యం కావాలి.
Also Read: చైనా, పాకిస్థాన్‌లకు షాక్.. UNలో బలుచిస్తాన్‌కు అండగా అమెరికా, బ్రిటన్
తెలంగాణ పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం. పట్టాణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్రం సాయం కోరుతున్నాం. రాష్ట్రంలో రాజకీయ మార్పులు అనేవి పాలసీలపై ఎలాంటి ప్రభావం చూపించవు. అనేక సౌకర్యాలు, తక్కువ నిబంధనలు, సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. దేశంలో ఇప్పటికే తెలంగాణ పెట్టుబడుల కోసం ఆకర్షణీయమై రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ రోజురోజుకి విస్తరిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు శ్రమిస్తున్నాం. ఈ సదస్సు ద్వారా కూడా మరిన్ని వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: నువ్వసలు మనిషివేనా? ప్రియుడు వెక్కిరించాడని..కన్నబిడ్డను సరస్సులో పడేసి చంపిన తల్లి
రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ ప్రాంతంలో కొత్త పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర యువతకు మరిన్ని ఉద్యోగవకాశాలు పెరుగుతాయి. మా ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు రావొచ్చు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నాయి. గత బీఆర్‌ఎస్, అంతకుముందు టీడీపీ, కాంగ్రెస్ కూడా ఇలానే చేశాయని'' రేవంత్ అన్నారు.