SLBC టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అన్నారు. 1983లో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధకరమని పేర్కొన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లెలో ఆయన పర్యటించారు. అక్కడ హెలీ మాగ్నటిక్ సర్వేకు రెడీగా ఉన్న సర్వే హెలికాప్టర్, అధునాతన పరికరాలను పరిశీలించారు. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ.. టన్నెల్ బోర్ మిషన్‌తో ప్రాజెక్టు పనులు చేయడం కష్టంగా మారిందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా SLBC టన్నెల్ పనులు పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు.  
Also Read: ఓరి దేవుడా.. వాళ్లు 12 గంటలు ఆడారు మేడమ్.. సీఎం మమతా బెనర్జీ ట్వీట్ కు బీజేపీ కౌంటర్!
1983లో SLBC ప్రాజెక్టు మంజూరు ప్రాజెక్టు మంజూరు అయినప్పుడు దీని అంచనా విలువ రూ.1,968 కోట్లు ఉండేది. గత 20 ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రాజెక్టు పనుల్లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సమయానికి టన్నెల్ నిర్మాణం 30 కిలోమీటర్లు పూర్తయ్యింది.  గత పదేళ్లలో కేసీఆర్ సర్కార్ మిగతా 10 కి.మీ టన్నెల్ పనులు పూర్తి చేయలేదు. దీనికి కమిషన్లు రావనే కారణంతోనే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు.   
జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్ పట్టించుకోలేదు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే నల్గొండ జిల్లాకు నీరు వచ్చేది. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు గుర్తింపు వస్తుందనే భయంతో దీన్ని పట్టించుకోలేదు. అంతేకాదు కృష్ణా నది మీద చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ కేసీఆర్ పట్టించుకోలేదు. సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కేసీఆర్ సర్కార్ గత పదేళ్లలో రూ.1.86 లక్షల కోట్లు చెల్లించింది. 
Also Read: చేవెళ్ల బస్సు ప్రమాదం.. అనాథలైపోయిన ఇద్దరు చిన్నారులు
ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసమే రూ.1.06 లక్షల కోట్లు చెల్లించారు. ఏపీ ప్రభుత్వం గత పదేళ్లలో కృష్ణా నదిపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది. వాటిని పూర్తి చేసింది. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం కృష్ణా నదిపై ఎలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని'' సీఎం రేవంత్ అన్నారు. 
Telangana: SLBC టన్నెల్ పూర్తి చేసి తీరుతాం.. సీఎం రేవంత్
SLBC టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అన్నారు. 1983లో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధకరమని పేర్కొన్నారు.
CM Revanth Key Comments on SLBC Tunnel