Telanagna: మూడు జోన్లుగా తెలంగాణ.. గ్లోబల్‌ సమ్మిట్‌లో సీఎం రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ సదస్సులో సీఎం రేవంత్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని.. 2047 లక్ష్యాలు టార్గెట్‌గా ముందుకెళ్తున్నామని తెలిపారు.

New Update
CM Revanth

CM Revanth

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ సదస్సులో సీఎం రేవంత్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని.. 2047 లక్ష్యాలు టార్గెట్‌గా ముందుకెళ్తున్నామని తెలిపారు. '' తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేదే తమ ఆశయం. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నాం. కేంద్రం వాటా కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని టార్గెట్‌గా పెట్టుకుంది. దేశంలోని జీడీపీ వాటాలో తెలంగాణ నుంచి 10 శాతం ఉండాలనేదే మా లక్ష్యం. 

Also Read: తెలంగాణకు ట్రంప్ బంపరాఫర్.. ఏకంగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

CM Revanth Comments On Telangana Rising Global Summit 2025

టార్గెట్ పెద్దదే. కానీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం ఉంది. అందరి సహకారంతో మా లక్ష్యాన్ని చేరుకుంటాం. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైంది. దేశ జనాభాలో మనం 2.9 శాతమే ఉన్నాం. కానీ దేశానికి 5 శాతం ఆదాయం ఇస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించాం. వాటిని సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించాం. క్యూర్‌, ప్యూర్, రేర్‌ జోన్లుగా వీటిని పిలుస్తున్నాం. 

Also Read: గుడ్‌న్యూస్.. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

చైనాలో ఉన్న గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్ స్పూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నాం. ఆ ప్రాంతం 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించింది. అందుకే ఇక్కడ కూడా గ్వాంగ్‌డాంగ్‌ నమూనాను అమలు చేయనున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్‌ మారు ఆదర్శమని'' సీఎం రేవంత్ అన్నారు. 

Advertisment
తాజా కథనాలు