BIG BREAKING: 'డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో ఈడీ రైడ్స్'

ఐదేళ్ల క్రితం రేవంత్‌పై ఈడీ కేసు నమోదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. బీహార్‌ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయని ఆరోపించారు.

New Update
MLA Harish rao sensational comments on Batti vikramarka

MLA Harish rao sensational comments on Batti vikramarka

మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రావు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల క్రితం రేవంత్‌పై ఈడీ కేసు నమోదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బీహార్‌ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయని ఆరోపించారు. అలాగే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్‌ జరిగితే ఆ దర్యాప్తు సంస్థ ఎందుకు చెప్పలేదని, ఎందుకు ప్రెస్ స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని ప్రశ్నించారు. 

Also Read: జూబ్లీహిల్స్‌పై AI సంచలన సర్వే.. గెలిచేది ఎవరో తెలుసా?

రేవంత్‌ రెడ్డిది, కిషన్ రెడ్డిది ఫెవికల్ బంధం. ఐదేళ్ల క్రితం రేవంత్‌పై ఈడీ కేసు నమోదైతే ఎందుకు అరెస్టు చేయలేదు. ప్రధాన మంత్రే ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పారని అయినా ఈరోజుకి ఎందుకు విచారణ జరగలేదు. ఈ నెలలో బీహార్‌ ఎన్నికల కోసం డబ్బులు పంపుతున్నారని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయి. ఈ విషయం ఎందుకు బయటపడలేదు. భట్టి ఢిల్లీకి వెళ్లినప్పుడు తెలంగాణ భవన్‌లో ఉండడు. గురుగావ్‌లో ఆయన అత్తగారిల్లు, ఆయన ఇల్లు ఉంటుంది అక్కడికి వెళ్తాడు. ఆ గురుగావ్ ఇంట్లోనే ఐటీ రైడ్స్‌ జరిగాయి. ఈ విషయం ఎందుకు బయటపడలేదు. మీ మధ్య ఏం ఒప్పందం ఉంది. 

పొంగులేటి ఇంట్లో మూడు రోజులు ఈడీ రైడ్స్‌ జరిగాయి. లోపల ఏం దొరికింది, ఎంత దొరికింది అనేదానిపై ఈడీ స్టేట్‌మెంట్ ఇస్తుంది. కానీ పొంగులేటి విషయంలో ఎందుకు ఇవ్వలేదు. దీన్నిబట్టి రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికల్‌ బంధం ఉందని అర్థం అవుతుంది. ఢిల్లీకి వెళ్తే నువ్వు (రేవంత్‌ను ఉద్దేశిస్తూ) చీకట్లో కార్లలో తిరిగేది, ఎవరెవరిని కలిసేది బయటికి వస్తున్నాయని'' హరీశ్ రావు అన్నారు. 

Advertisment
తాజా కథనాలు