సీఎం రేవంత్ రెడ్డి(cm revanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్తల్-నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోతం మోగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం మక్తల్‌లో ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు జిల్లా(palamuru)ను, ముఖ్యంగా నారాయణపేట జిల్లా ప్రజల సమస్యలను బీఆర్‌ఎస్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శలు చేశారు.
Also read: గాల్లో రెండు విమానాలు ఢీకొనకుండా ఎలా ప్రయాణిస్తాయో తెలుసా ?
Revanth Reddy Comments On Maktal Narayanapet Kodangal Project Contractors
'' గత ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనే ఆలోచన వాళ్లకి లేదు. మేము అధికారంలోకి రాగానే పనులు ప్రారంభించేందుకు యత్నిస్తే కోర్టులో కేసులు వేశారు. ఏడాదిన్నర పాటు పనులు జరగకుండా ఆపించేశారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఏ రైతుకు కూడా నష్టం జరగొద్దని ఎకరానికి రూ.20 లక్షలు ఇచ్చి భూసేకరణ చేశాం. నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేసి ఇప్పుడు పనులు ప్రారంభించబోతున్నాం. పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు డిసెంబర్ 8,9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని మారుస్తాం. పంచాయతీ ఎన్నికలు వచ్చేశాయి. మంచివారిని ఎన్నుకొని మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. మీకు నీళ్లు, నిధులు ఇచ్చే బాధ్యత నాది. రాబోయే పదేళ్లలో పాలమూరును పసిడి పాలమూరుగా అభివృద్ధి చేసుకుందామని'' సీఎం రేవంత్ అన్నారు.
Also Read: ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్.. డిలేట్ కూడా చేయలేరు..
అయితే ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్ల వీపు విమానం మోతం మోగుతుందని సీఎం రేవంత్ హెచ్చరించడం దుమారం రేపుతోంది. ఎందకుంటే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కూడా ఉంది. దీంతో రేవంత్.. పరోక్షంగా పొంగులేటికి కూడా వార్నింగ్ ఇచ్చారంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలాఉండగా సీఎం రేవంత్ గత శుక్రవారం మక్తల్ నియోజకవర్గంలో రూ.270 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
CM Revanth: ప్రాజెక్టు పూర్తి కాకుంటే కాంట్రాక్టర్ల వీపు విమానం మోతే.. సీఎం రేవంత్ హెచ్చరిక
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్తల్-నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోతం మోగుతుందని హెచ్చరించారు.
CM Revanth