Betting App Case: రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు!
బెట్టింగ్ యాప్ కేసులో సెలెబ్రెటీలు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు అందాయి. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్రాజ్విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
బెట్టింగ్ యాప్ కేసులో సెలెబ్రెటీలు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు అందాయి. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్రాజ్విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 21 వరకు మొత్తంగా 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో మొత్తంగా 15 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.
కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్(101) సోమవారం కన్నుమూశారు. 2006-11 మధ్య ఆయన కేరళ సీఎంగా ఆయన పనిచేశారు. వెలిక్కకతు శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబరు 20లో జన్మించారు.
బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోనియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించింది. తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ జైలు జీవితం ప్రారంభించి నెల రోజులైంది. షిల్లాంగ్ జైలులో నెల రోజులుగా ఉన్న సోనమ్‌లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని, ఆమెలో పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. సోనమ్ రఘువంశీ జైలు వాతావరణానికి అలవాటు పడింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని ధాములో పెనుప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు చక్కి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయానికి ట్రైన్ బ్రిడ్జ్‌ను దాటేయడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో వైరలవుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన కిందపడిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రని అన్నా సలైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ సీఎంకు చికిత్స కొనసాగుతోంది.
మరో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబైకి వచ్చిన విమానం.. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయ్యేటప్పుడు రన్‌వేపై అదుపుతప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం వైసీపీ అధినేత జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ వ్యవహారంపై ప్రభుత్వం చట్టప్రకారం ముందుకెళ్తోందని తెలిపారు. ఈ కేసులో ఎంతటివారున్నా వదిలేదు లేదని స్పష్టం చేశారు.