Subclade K: అమెరికా, ఐరోపా దేశాల ప్రజల్ని వణికిస్తున్న డేంజరస్ వైరస్

అమెరికా, ఐరోపా దేశాల్లో 'సబ్ క్లేడ్ K' అనే కొత్త రకం ఇన్ఫ్లుఎంజా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీన్ని డాక్టర్లు, అంతర్జాతీయ మీడియా 'సూపర్ ఫ్లూ' అని పిలుస్తున్నారు. సాధారణ ఫ్లూ కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి.

New Update
Subclade K

అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రస్తుతం 'సబ్ క్లేడ్ K' అనే కొత్త రకం ఇన్ఫ్లుఎంజా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీన్ని డాక్టర్లు, అంతర్జాతీయ మీడియా 'సూపర్ ఫ్లూ' అని పిలుస్తున్నారు. సాధారణ ఫ్లూ కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి.

‘సబ్ క్లేడ్ K’ అంటే ఏమిటి?
ఇది ఇన్ఫ్లుఎంజా-A రకానికి చెందిన H3N2 వైరస్ రూపాంతరం. వైరస్లలో సహజంగా జరిగే 'యాంటిజెనిక్ డ్రిఫ్ట్' ప్రక్రియ వల్ల ఈ కొత్త వేరియంట్ ఉద్భవించింది. దీని ఉపరితలంపై ఉండే హెమగ్లుటినిన్ అనే ప్రోటీన్‌లో కీలకమైన మార్పులు జరగడం వల్ల, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దీనిని గుర్తించడంలో ఇబ్బంది పడుతోంది. గత ఏడాది ఆస్ట్రేలియాలో మొదటిసారి గుర్తించిన ఈ వైరస్, ప్రస్తుతం అమెరికాలోని దాదాపు 30కి పైగా రాష్ట్రాల్లో, బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో విజృంభిస్తోంది.

ప్రధాన లక్షణాలు
ఈ 'సూపర్ ఫ్లూ' లక్షణాలు సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉన్నప్పటికీ, దీని తీవ్రత, వేగం ఆందోళన కలిగిస్తున్నాయి. 

ఒక్కసారిగా 103- నుంచి104 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు జ్వరం రావడం.
ఊపిరితిత్తుల్లో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
కండరాల నొప్పులు, తలనొప్పి, విపరీతమైన నీరసం.
ముఖ్యంగా పిల్లల్లో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

టీకా: 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లూ వ్యాక్సిన్లు ఈ 'సబ్ క్లేడ్ K' వేరియంట్‌కు పూర్తి స్థాయిలో సరిపోలడం లేదు. అయినప్పటికీ, టీకా వేయించుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుందని, ప్రాణాపాయం, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తప్పుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతాయి, కానీ ఈ వేరియంట్ అతి తక్కువ సమయంలోనే వేలాది మందిని ప్రభావితం చేస్తోంది. అమెరికాలో ఇప్పటికే ఈ సీజన్‌లో సుమారు 5,000 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా దీని నుండి రక్షణ పొందవచ్చు.

Advertisment
తాజా కథనాలు