SIT Notices: సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి సిట్ నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10గంటలకు సిట్ ఎదుట హాజరు కావలని అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. 

New Update
kondal reddy

ఫోన్ ట్యాపింగ్ కేసు(phone tapping case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10గంటలకు సిట్ ఎదుట హాజరు కావలని అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చింది. 

Also Read :  భార్య వంట చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

SIT Notices To CM Revanth Reddy's Brother

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావుకు సిట్‌ నోటీసులు ఇచ్చింది. బుధవారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కొండలరావు, సందీప్‌ ఫోన్లు ట్యాప్‌ అయినట్లు సిట్‌ గుర్తించింది. వివరాల నమోదుకు జూబ్లీహిల్స్‌లోని కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతలకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యను గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Also Read :  మృత్యుపాశాలుగా మారిన చైనా మాంజా.. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు

Advertisment
తాజా కథనాలు