Venezuela: చైనాతో సహా ఆ దేశాలన్నింటికీ కటీఫ్ చెప్పాలి..వెనెజువెలాకు ట్రంప్ మరోసారి వార్నింగ్

వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేశాక ఆ దేశాన్ని తానే నియంత్రిస్తానని చెప్పిన ట్రంప్..ఇప్పుడు చమురు విషయంలో కొత్త ప్రభుత్వంపై ట్రంప్ షరతులు విధిస్తున్నారు. చైనాతో సహా ఆ దేశాలతో కటీఫ్ చెప్పండి అంటూ ఒత్తిడి తెస్తున్నారు. 

New Update
Trump

Trump

వెనెజువెలా(us vs venezuela) మాజీ అధ్యక్షుడు మదురో(Nicolás Maduro) ను అరెస్ట్ చేశారు. ఆయనను, భార్యను అమెరికా తీసుకువచ్చి మరీ నిర్భంధించారు. దాని తరువాత వెనెజువెలా లో తాత్కాలికంగా కొత్త అధ్యక్షురాలు నియమింపబడ్డారు. మదురోను అరెస్ట్ అయితే చేశాం కానీ వెనెజువెలాను తాము ఆధీనంలోకి తీసుకోవడం లేదని చెప్పారు. అయితే దేశాన్ని తానే నియంత్రిస్తున్నట్లు ట్రంప్(trump) ప్రకటించుకున్నారు. దాంతో పాటూ వెనుజులా చమురు వెలికితీయాలంటే, ట్రంప్ విధించిన షరతులను పాటించాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు దానికి సంబంధించి షరతులను కూడా విధిస్తున్నారు. 

Also Read :  తనకే దిక్కులేని పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు ఫైటర్ జెట్లు ఇస్తానని ఒప్పందం

అన్ని దేశాలకూ కటీఫ్ చెప్పండి..

తాజాగా వెనెజువెలా కొత్త అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చమురు విషయంలో ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. చైనా, రష్యా, ఇరాన్, క్యూబా దేశాలతో సంబంధాలు తెంచుకోవాలని, ఆ దేశాలను బహిష్కరించాలని...ఆర్థిక సంబంధాలను పూర్తిగా నిలిపేయాలని ట్రంప్ అడుగుతున్నారని తెలుస్తోంది. దాంతో పాటూ చమురు ఉత్పత్తిలో అమెరికాతోనే భాగస్వామ్యం కుదుర్చుకోవాలని...భారీ చమురు అమ్మకాల్లో తమ దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలా చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. 

Also Read :  వెనెజువెలాలో ఉద్రిక్తతలు.. రంగంలోకి దిగిన రష్యా

మొత్తం చమురు మాకే ఇవ్వాలి..

చమురు విషయంలో వెనెజువెలాను అమెరికా ఇప్పటికే చాలా నిర్భంధంలో ఉంచింది. ప్రస్తుతం ఆ దేశం దగ్గర ఉన్న చమురు ట్యాంకర్లు అన్నీ నిండిపోయాయి. కొత్తగా ఉత్పత్తి చేయడానికి స్థలం లేదు. ఉన్నదాన్ని అమ్మితే కానీ కుదరదు. డిసెంబర్ చివరి నుంచి వెనుజులా చమురు బావులను మూసివేయడం ప్రారంభించింది. అమెరికా దిగ్బంధనం వల్ల ఉత్పత్తి అయిన చమురును నిల్వ చేయడానికి స్థలం లేకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు మరిన్ని బావులు మూతపడితే వెనెజువెలా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అది కొత్త అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ అధికారానికే ముప్పు. వెనిజులా తన చమురు నిల్వలను అమ్మకుండా మరికొన్ని వారాలు మాత్రమే ఆర్థికంగా నిలబడగలదు. అందుకే ఇప్పుడు అక్కడి చమురును నియంత్రించాలని అమెరికా ఆలోచన. ఆ దేశంలో మొత్తం చమురును తామే కొనుక్కుని...ఇందులో కూడా నంబర్ వన్ గా నిలవాలనేది అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన. ఇప్పటికే వెనుజులాలోని తాత్కాలిక అధికారులు 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగిస్తారని, దానిని మార్కెట్ ధరకు అమ్ముతారని ట్రంప్ ప్రకటించారు. ‘ఆ నిధులను తానే నియంత్రిస్తానని, వెనుజులా ప్రజలు, అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా వాటిని ఉపయోగిస్తాను’ ట్రంప్ తెలిపారు. ఇకపై మిగతా అంత చమురు కూడా అమెరికాకే వస్తే ప్రపంచంలో చమురు అమ్మకాల్లో అమెరికా నంబర్ వన్ గా నిలవడం ఖాయం. అప్పుడు చైనా, రష్యా వంటి దేశాలపై ఆధిపత్యం యూఎస్ కు సులువు అయిపోతుంది. అందుకే చమురు విషయంలో ఆ దేశాలతో కటీఫ్ చెప్పాలని వెనెజువెలా పై ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు