/rtv/media/media_files/2026/01/07/honey-2026-01-07-17-13-36.jpg)
ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి అంటే...మనం ఎలా బతుకుతున్నామో అర్థం కావడం లేదు. మనుషులు పీల్చే గాలి నుంచి అనారోగ్యానికి వాడే మందుల వరకూ అన్నీ కల్తీ అయిపోతున్నాయి. కూరలు, పాలు..ఇలా ఒకటేమిటి అన్ని పదార్థాలు అసలువి దొరకడం మానేశాయి. అలా అని అన్నీ వాడడం మానేసి కూర్చుందాం అంటే వీలు కాదు. జనాలు పాపం అలానే సతమతమవుతూ బతుకుతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మోసాలు చేయడం మానడం లేదు కొందరు దుర్మార్గులు. డబ్బులు వస్తే చాలు ఏవరేమైపోతేనేం అనుకుంటున్నారు. తాజాగా ఇలాంటి వారినే కొందరిని పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.
Also Read : తెలంగాణ ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిది.. నీళ్లపై కాదు: ఏపీ సీఎం చంద్రబాబు
140 క్వింటాళ్ళు...500 డ్రమ్ములు..
ఉత్తరప్రదేశ్(uttarpradesh) నుంచి ఆంధ్రాకు భారీగా తేనె(honey) సరఫరాకు సిద్ధం అయింది. ఒక్కొక్కటి 140 క్వింటాళ్లకు పైగా తేనెను కలిగి ఉన్న 500 డ్రమ్ముల తేనె ట్రక్కలతో రెడీగా ఉంది. మరికొన్ని గంటలు ఆగితే ఇదంతా ఆంధ్రాలో దుకాణాలకు చేరిపోతుంది. కానీ ఈలోపునే ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దానిని పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో.. ఆంధ్రప్రదేశ్‌కు ట్రక్కులలో తరలించిన నకిలీ తేనెను స్వాధీనం చేసుకున్నారు. తేనె గిడ్డంగుల నుంచి అందిన సమాచారం ప్రకారం తనిఖీలు జరిపారు. అక్కడి అధికారులకు..ఒక్కొక్కటి 140 క్వింటాళ్లకు పైగా తేనెను కలిగి ఉన్న 500 డ్రమ్ములు వరుసలలో వరుసలో ఉన్నాయి. బయట ఒక ట్రాన్స్‌పోర్టర్ ట్రక్ పూర్తిగా లోడ్ చేయబడి, మరొక రాష్ట్రానికి రవాణా చేయడానికి ఆగి ఉండి కనిపించింది. వాటిని చెక్ చేయగా అది మొత్తం నకిలీ తేనెగా గుర్తింపబడింది.
Also Read : నేటినుంచి అమరావతి రెండోదశ భూ సమీకరణ ప్రారంభం..
సీరమ్ కలిపి అమ్ముతున్నారు..
ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FSSAI) ఆపరేషన్‌కు ఆ శాఖ అదనపు కమిషనర్ సునీల్ కుమార్ నాయకత్వంలో అధికారుల బృందం గిడ్డంగులలోనే తేనె నమూనాను సేకరించి పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో అధికారులు తేనెను సీరంతో కల్తీ చేశారని తేల్చారు. తేనె కు రంగు, తీపిని తీసుకురావడానికి దీనిని ఉపయోగించారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని..ఈ సీరమ్ వలన మనుషుల ఆరోగ్యం దెబ్బ తింటుందని చెబుతున్నారు. ఈ తేనెను హర్యానా నుండి సేకరించి, హాపూర్‌లోని ఈ గిడ్డంగికి తీసుకువచ్చి , అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్‌కు పంపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడైంది . ప్రస్తుతం మరిన్ని టెస్ట్ ల కోసం తేనె శ్యాంపిల్ ను అధికారులు ల్యాబ్ కు పంపించారు. రిజల్ట్ వచ్చేవరకు మొత్తం తేనెను స్వాధీనం చేసుకున్నామని అదనపు కమిషనర్ సునీల్ కుమార్ తెలిపారు. నివేదిక అందాక నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హాపూర్ నుంచి నకిలీ పదార్థాలు రవాణా అవడం మొదటిసారి కాదని...ఇంతకు ముందు గుడ్లు, ఆవ నూనె, చిక్ పీస్ వంటివి కూడా ఇలానే రవాణా అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
Follow Us