Lalu Prasad Yadav: సింగపూర్ సైన్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు.. పట్టలేని సంతోషంతో తల్లి

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, రోహిణీ ఆచార్య కుమారుడు ఆదిత్య పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి అతను సింగపూర్‌లో ఆర్మీ ట్రైనింగ్‌లో చేరడం అందరిని ఆశ్చర్యానికి గురించేస్తోంది. 

New Update
lalu prasad yadav

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav family) మనవడు, రోహిణీ ఆచార్య కుమారుడు ఆదిత్య(aditya) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి అతను సింగపూర్‌లో ఆర్మీ ట్రైనింగ్‌(Singapore military training) లో చేరడం అందరిని ఆశ్చర్యానికి గురించేస్తోంది. 

మిలిటరీ యూనిఫాంలో లాలు మనవడు
బీహార్ రాజకీయ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం నుంచి ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటి సైనిక శిక్షణలో అడుగుపెట్టాడు. లాలు కుమార్తె రోహిణీ ఆచార్య పెద్ద కుమారుడు ఆదిత్య (18) సింగపూర్‌లో రెండేళ్ల పాటు సాగే బెసిక్ మిలిటరీ ట్రైనింగ్‌లో చేరారు. ఈ విషయాన్ని రోహిణి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె కొడుకుని చూసి చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు.

Also Read :  కుక్కలవేనా..కోళ్ళు, మేకలవి ప్రాణాలు కావా..సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Lalu Prasad Yadav Grandson Joins Singapore Military Training

సాధారణంగా రాజకీయ కుటుంబాల్లోని యువత రాజకీయాల్లోకి రావడం చూస్తుంటాం. కానీ ఆదిత్య మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. "ఈరోజు నా హృదయం గర్వంతో నిండిపోయింది. తన ప్రీ-యూనివర్సిటీ చదువు పూర్తి చేసిన తర్వాత, కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆదిత్య కఠినమైన సైనిక శిక్షణకు వెళ్లాడు. ఆదిత్యా.. నువ్వు ధైర్యవంతుడివి, క్రమశిక్షణ గలవాడివి. వెళ్లు.. నీ సత్తా చాటుకో" అంటూ రోహిణి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఆదిత్య సింగపూర్‌లో శిక్షణ పొందడం వెనుక అక్కడి చట్టం ప్రధాన కారణం. సింగపూర్ నిబంధనల ప్రకారం, 18 ఏళ్లు నిండిన ప్రతి పురుష పౌరుడు లేదా రెండో తరం పర్మనెంట్ రెసిడెంట్ ఖచ్చితంగా రెండేళ్ల పాటు జాతీయ సేవ చేయాల్సి ఉంటుంది. రోహిణీ ఆచార్య కుటుంబం చాలా కాలంగా సింగపూర్‌లో స్థిరపడటంతో, అక్కడి నిబంధనల ప్రకారం ఆదిత్య ఈ శిక్షణలో చేరారు.

ఈ రెండేళ్ల శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. కఠినమైన వ్యాయామాలు, గన్స్, ఇతర యుద్ధ పరికరాలను వాడటంపై శిక్షణ. టీమ్ వర్క్, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం. ఈ శిక్షణ పూర్తి చేసిన తర్వాత, వారు రిజర్వ్ దళాలుగా ఉంటారు. దేశానికి అవసరమైనప్పుడు లేదా యుద్ధ సమయాల్లో వీరు తమ సేవలను అందించాల్సి ఉంటుంది.

వైరల్ అవుతున్న ఫోటోలు
ఆదిత్య తన జుట్టును పూర్తిగా కత్తిరించుకుని, సైనిక దుస్తుల్లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాలు అభిమానులు, ఆర్జేడీ శ్రేణులు ఆదిత్య నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ దానం చేసి వార్తల్లో నిలిచిన రోహిణి, ఇప్పుడు తన కుమారుడిని దేశ రక్షణ శిక్షణకు పంపి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.

Also Read :  తనకే దిక్కులేని పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు ఫైటర్ జెట్లు ఇస్తానని ఒప్పందం

Advertisment
తాజా కథనాలు