/rtv/media/media_files/2026/01/07/pak-fiter-gets-2026-01-07-16-30-59.jpg)
పాకిస్తాన్ గొప్పలు మామూలుగా లేవు.. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్స్ అడ్డుకోలేక పాక్ కీలకమైన ఎయిర్ బెయిస్‌లు ధ్వంసమైన విషయం తెలిసిందే. సొంత రక్షణ వ్యవస్థనే కాపాడుకోలేక పోయిన పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌కు ఆయుధాలు ఇస్తానని ముందుకొస్తోంది. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఉంది పాక్ తీరు. యుద్ధంలో ఆ దేశానికి దిక్కు లేదు.. బంగ్లాదేశ్‌కు యుద్ధ విమానాలు అమ్మడానికి సిద్ధమవుతుంది. పాకిస్థాన్ తయారు చేసిన JF-17 థండర్ యుద్ధ విమానాల(JF-17 jets) కొనుగోలుపై బంగ్లాదేశ్ ఆసక్తి చూపడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
#BREAKING
— Defense Technology of Bangladesh-DTB (@DefenseDtb) January 6, 2026
Bangladesh Air Force chief Air Chief Marshal Hasan Mahmud Khan visits Pakistan. A potential deal to be signed with Pakistan for JF-17 thunder block 3 and Super Mushak aircraft from Pakistan for BAF pic.twitter.com/QdnsX5aKNc
Also Read : చైనాతో సహా ఆ దేశాలన్నింటికీ కటీఫ్ చెప్పాలి.. వెనెజువెలాకు ట్రంప్ మరోసారి వార్నింగ్
Pakistan Eyes Defence Pact With Bangladesh
దశాబ్దాల కాలంగా స్తంభించిపోయిన పాకిస్థాన్-బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పుడు రక్షణ రంగం వేదికగా కొత్త మలుపు తిరుగుతున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మహమూద్ ఖాన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల ఇస్లామాబాద్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా పాక్ వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూతో జరిపిన చర్చల్లో JF-17 థండర్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రధాన అంశంగా నిలిచింది.
పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం వెల్లడించిన సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించే క్రమంలో పాకిస్థాన్ నుంచి దాదాపు 16 నుంచి 24 వరకు JF-17 బ్లాక్ III యుద్ధ విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం విలువ సుమారు 400 మిలియన్ల నుంచి 700 మిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం యుద్ధ విమానాలే కాకుండా, సూపర్ ముషాక్ శిక్షణ విమానాలను కూడా వేగంగా సరఫరా చేస్తామని పాక్ హామీ ఇచ్చింది. బంగ్లాదేశ్ వద్ద ఉన్న పాత విమానాల నిర్వహణ, ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థల అనుసంధానంలో పాక్ సహకారం అందించనుంది. 2025 మే నెలలో భారత్-పాక్ మధ్య జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో JF-17 విమానాల పనితీరును చూసి బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.
బంగ్లాదేశ్ తన రక్షణ అవసరాల కోసం సాంప్రదాయకంగా రష్యా, చైనాపై ఆధారపడేది. అయితే, ఇప్పుడు పాకిస్థాన్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం, సరిహద్దుల్లో ఉమ్మడి వ్యూహాలు రచించడం భారత్‌కు భద్రతా పరమైన సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : భారీ వరదలు.. 16 మంది మృతి
Follow Us