/rtv/media/media_files/2025/08/11/big-supreme-court-order-on-stray-dog-menace-2025-08-11-14-09-27.jpg)
Big Supreme Court Order On Stray Dog Menace
వీధి కుక్కల(relocate street dogs) వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల విషయంపై పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలు అవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. కేవలం కుక్కలపైనే ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు. కోళ్ళు, మేకలు జంతువులు కావా...వాటివి ప్రాణాలు కావా అంటూ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. జంతు సంరక్షకులు కేవలం కుక్కల విషయంలోనే ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించింది. జంతు సంరక్షకులు, ప్రేమికులు తరుఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. పిటిషనర్ల తరుఫున న్యాయవాదులు, కపిల్ సిబల్ వాదనలతో కోర్టు దద్దరిల్లింది.
Also Read : ప్రపంచ రాజకీయాలను మార్చుతున్న కనిపించని శక్తులు.. తెర వెనుక మాస్టర్ మైండ్స్ వీరే!
చికిత్స కంటే నివారణే ముఖ్యం..
రోడ్లు, పాఠశాలల వద్ద కుక్కల వల్ల ప్రమాదాలు జరగడంపై సుప్రీం కోర్టు(Supreme Court) ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కుక్కలు కరుస్తున్నాయా లేదా అనే విషయాన్ని అవి దగ్గరకు వచ్చేంత వరకు తెలుసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిపై కపిల్ సిబల్ స్పందిస్తూ.. అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం...వీధి కుక్కలను అక్కడ పెట్టడం, కారుణ్య మరణం లాంటి పద్ధతులతో ఆ సమస్య కట్టడి అవుతూందని..మన దేశంలో వాటిని సరిగ్గా పాటించడం లేదని...వీధుల్లో చెత్త విపరీతంగా పేరుకుపోవడంతో సమస్య తీవ్రతరం అవుతోందని చెప్పారు.
Also Read : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మోదీ ఫోన్.. యుద్ధం గురించి ఆరా!
జంతు కాదు కుక్క ప్రేమికులు..
మరోవైపు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల తరుఫున న్యాయవాదులు విదిస్తూ..వీధి కుక్కల వల్ల సామాన్యులు నరకం చూస్తున్నారని, కుక్కల హక్కుల కంటే మానవ హక్కులను కాపాడటం అత్యవసరమని అన్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA) తమ కాలనీలను నో డాగ్ జోన్స్‌గా ప్రకటించే అధికారం ఇవ్వాలని కోరారు. ఇక ప్రభుత్వం తరుఫున సోలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ కేవలం కుక్క ప్రేమికుల చుట్టూనే తిరుగుతున్నాయని, జంతు ప్రేమికుల గురించి కాదని అన్నారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో 90 శాతం మంది వద్దన్నా, 10 శాతం మంది కోసమే కుక్కలను ఉంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కుక్కలు లాగే ఆవులను కట్టేసుకుంటామని అంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. అన్ని వైపుల వాదనలు విన్న ధర్మాసనం స్కూళ్లు, ఆసుపత్రులు, కోర్టుల వంటి సంస్థాగత ప్రాంతాల నుంచి కుక్కలను తొలగించాలనే తమ ఆదేశాలపై అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించింది. దీనిపై మరింత విచారణ చేస్తామని అందరి వాదనలను ఓపికగా వింటామని చెప్పింది.
Follow Us