ED notices: బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల విచారణ ED వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.