US State Department: ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఒక్క ఏడాదిలోనే లక్ష వీసాల రద్దు!

అమెరికా చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా కేవలం ఒక్క ఏడాది కాలంలోనే ఏకంగా లక్ష వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. 2024 ఏడాదితో పోలిస్తే వీసాల రద్దు ప్రక్రియ 150 శాతానికి పైగా పెరగడం గమనార్హం.

New Update
US revokes 85,000 visas amid sweeping immigration and security crackdown

US revokes 85,000 visas amid sweeping immigration and security crackdown

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే వలస విధానాలపై ఉక్కుపాదం మోపారు. అమెరికా చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా కేవలం ఒక్క ఏడాది కాలంలోనే ఏకంగా లక్ష వీసా(America Visa) లను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. 2024 ఏడాదితో పోలిస్తే వీసాల రద్దు ప్రక్రియ 150 శాతానికి పైగా పెరగడం గమనార్హం. మొత్తం రద్దు చేసిన లక్ష వీసాల్లో సుమారు 8,000 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 2,500 స్పెషల్ కేటగిరీ వీసాలపై వేటు పడింది. - US visa cancel

అమెరికా భద్రతా బలగాలతో గొడవకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వీరందరినీ తిరిగి వారి స్వదేశాలకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా నిబంధనలను ఉల్లంఘించిన వారిపైనే ఈ చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఈ నాలుగు కారణాల వల్ల వీసాలు రద్దయ్యాయి. - us state department

వీసా గడువు ముగిసినా ఉండటం: అనుమతించిన కాలం కంటే ఎక్కువ రోజులు అమెరికాలో అక్రమంగా నివసించడం.
డ్రంక్ అండ్ డ్రైవ్ : ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడటం.
దాడులకు పాల్పడటం: వ్యక్తులపై లేదా ఆస్తులపై భౌతిక దాడులు చేయడం.
దొంగతనాలు: ఏదైనా దొంగతనం లేదా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉండటం.

సోషల్ మీడియా వెట్టింగ్‌తో నిఘా

ప్రస్తుతం అమెరికా వీసా దరఖాస్తుదారులు, వీసా ఉన్నవారిపై ప్రభుత్వం డేగ కన్ను వేసింది. అన్ని రకాల వీసాలపై "సోషల్ మీడియా వెట్టింగ్‌" నిర్వహిస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంటే, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా లేదా అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా వీసాలు రద్దు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం అమెరికాలో ఉన్న ప్రవాసుల్లో ముఖ్యంగా భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు