Bhartha Mahasayulaku Wignyapthi Review: రవిజేతకు హిట్టు పడిందా? 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఎలా ఉందంటే

'క్రాక్'  సినిమా తర్వాత మళ్ళీ చాలా రోజులకి మాస్ మహారాజ రవితేకు మరో హిట్టు పడింది. ఈరోజు థియేటర్స్ లో విడుదలైన  'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రవితేజ తదైనా కామెడీ టైమింగ్, ఎనర్జీతో ఇరగదీశారని ఫ్యాన్స్ అంటున్నారు.

New Update
Bhartha Mahasayulaki Wignyapthi

Bhartha Mahasayulaki Wignyapthi

Bhartha Mahasayulaku Wignyapthi:  'క్రాక్'  సినిమా తర్వాత మళ్ళీ చాలా రోజులకి మాస్ మహారాజ రవితేజ(Hero Ravi Teja) కు మరో హిట్టు పడింది. ఈరోజు థియేటర్స్ లో విడుదలైన  'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రవితేజ తదైనా కామెడీ టైమింగ్, ఎనర్జీతో ఇరగదీశారని ఫ్యాన్స్ అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్లు ఉన్నా, ఓవరాల్‌గా పక్కా 'ఫ్యామిలీ ఎంటర్టైనర్' అని టాక్ వినిపిస్తోంది. సినిమాలో వామ్మో వాయ్యో పాట, కార్తీక దీపం సీరియల్ సాంగ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. మొత్తానికి రవితేజ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఫుల్ మీల్స్ అనిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ముఖ్యంగా మాస్ బీట్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.. - bhartha mahasayulaku wignyapthi review

ట్విట్టర్ రివ్యూ 

ట్విట్టర్ లో ఈ సినిమాకు ఎక్కడ చూసిన పాజిటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి. రవితేజ కామెడీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అలరిస్తోందని చెబుతున్నారు. హీరోయిన్ ఆషిక తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.  సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ.. తర్వాత రవితేజ, సునీల్, కమెడియన్ సత్య సన్నివేశాలతో ఎంగేజింగ్ గా మారుతుందని అంటున్నారు. . ఇంటర్వెల్ సీన్ సినిమాపై ఆసక్తిని పెచుతుంది. సునీల్, సత్య ఎపిసోడ్స్ మరో హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. 

Also Read :  రెడ్ శారీలో 'రాజాసాబ్' బ్యూటీ రిద్ధి కుమార్ అదిరే ఫోటోషూట్..

సంక్రాంతి పండుగ(sankranti 2026)కు సరిపోయే పక్కా i ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ప్రేక్షకులు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా వినోదాత్మకంగా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ఊహించదగ్గదిగా ఉన్నా, ఎమోషన్స్ బాగా పండాయని అంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి రవితేజ హిట్టు కొట్టారని అభిమానులు సంబర పడుతున్నారు. - Tollywood news updates

Advertisment
తాజా కథనాలు