/rtv/media/media_files/2026/01/17/suryapet-accident-2026-01-17-13-13-56.jpg)
Suryapet Accident
Suryapet Accident: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయుల వాహనం ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టి బోల్తా పడినట్లు సమాచారం.
ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏఎస్ఓగా(Administrative Support Officer) పని చేస్తున్న కల్పన అనే ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి(School Teacher Dies) చెందారు. సంఘటన స్థలంలోనే ఆమె మృతి చెందడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
Also Read: పాము గుడ్లు తినొచ్చా..? ఈ విషయం తెలిస్తే అవునా.. నిజమా.. అని అవాక్కవుతారు..!
Suryapet Road Accident
#Nalgonda
— Akalankam Seshu (@ienalgonda) January 17, 2026
In Arvapally mandal headquarters of Suryapet district, a car overturned after a tyre burst. In this incident, one teacher died while four others were injured.@NewIndianXpress@XpressHyderabad@Kalyan_TNIEpic.twitter.com/5e17sgcAtp
ఇక మరో ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. రావులపల్లి హెడ్మాస్టర్‌తో పాటు మరో హెడ్మాస్టర్ తులసికి గాయాలు కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాద సమయంలో తుంగతుర్తి జీహెచ్ఎం ప్రవీణ్, రావులపల్లి జీహెచ్ఎం గీత, అన్నారం జీహెచ్ఎం సునీతరాణి, ఏఎస్ఓ కల్పన కారులో ఉన్నట్లు తెలుస్తోంది.
కారు టైర్ ఒక్కసారిగా పేలిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ తన కళ్లముందే చెల్లి కల్పనను కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో, దానికి గల కారణాలు ఏమిటో అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక సిద్ధం చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
Also Read: అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' షురూ.. ఈ 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ప్రాథమిక సమాచారం ప్రకారం వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులు, స్థానిక ప్రజలకు పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు.
తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. రహదారి నిర్వహణ అధికారులు వేగ నియంత్రణ బోర్డులు, గ్రామ హద్దు సూచికలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు, మలుపుల వద్ద సూచికలు, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజలు రోడ్డు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, మద్యం మత్తులో వాహనాలు నడపకూడదు, అతివేగం నివారించాలి, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని సూచించారు. ఈ పరిశీలనలో ఎస్పీతో పాటు నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, స్థానిక ఎస్సై సైదులు, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, రహదారి నిర్వహణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Follow Us