Donald Trump: ఇరాన్‌‌ని టార్గెట్ చేస్తూ.. ఆ దేశాలపై ట్రంప్ మరోసారి టారీఫ్ బాంబు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన "టారిఫ్" అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు.

New Update
Trump

Trump

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన "టారిఫ్"(donald trump tariffs) అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు సోమవారం (జనవరి 12) అధికారికంగా ప్రకటించారు. ట్రంప్ 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. "ఇకపై ఇరాన్ దేశంతో బిజినెస్ చేసే ఏ దేశమైనా సరే, అమెరికాతో వ్యాపారం చేయాలంటే 25 శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి" అని పేర్కొన్నారు.

ఇరాన్ ప్రభుత్వం తన దేశంలోని నిరసనకారులపై సాగిస్తున్న హింసాత్మక అణచివేతను నిరసిస్తూ ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో వందలాది మంది మరణించడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో టెహ్రాన్ (ఇరాన్ రాజధాని) పాలకులను ఆర్థికంగా ఒంటరిని చేయడం ద్వారా వారిని దారికి తెచ్చుకోవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. - us tariff on india

Also Read :  షక్స్ గామ్ వ్యాలీ మాదంటే మాదంటున్న భారత్, చైనాలు..ప్రకటనలు

ప్రభావితం కానున్న దేశాలు:

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ నుండి చమురు, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో ఇవి ఉన్నాయి.

చైనా: ఇరాన్ చమురుకు అతిపెద్ద కొనుగోలుదారు.
భారత్: సాంప్రదాయకంగా ఇరాన్‌తో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది.
టర్కీ, యూఏఈ: ఇరాన్‌తో సరిహద్దు, ఆర్థిక సంబంధాలు ఉన్న దేశాలు.

Also Read :  రక్తం కక్కుకున్న వెనెజువెలా సైనికులు.. మదురోను తీసుకెళ్లేందుకు అమెరికా వాడిన సీక్రెట్‌ వెపన్ ఏంటో తెలుసా ?

ప్రపంచ మార్కెట్‌లో ఆందోళన 

ట్రంప్ తన రెండవ విడత పాలనలో ఇప్పటికే కెనడా, మెక్సికో, భారత్‌పై పలు కారణాలతో (రష్యా చమురు వంటివి) సుంకాలు విధించారు. ఇప్పుడు ఇరాన్ సాకుతో మరో 25 శాతం పన్ను భారం మోపడం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా మార్కెట్‌ను కోల్పోకూడదనుకుంటే, ఆయా దేశాలు ఇరాన్‌తో వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ విషయంలో సైనిక చర్య సహా అన్ని దారులు తెరిచి ఉంచారని, అయితే ప్రస్తుతం ఆర్థిక ఆంక్షల ద్వారా శాంతియుత ఒత్తిడిని పెంచుతున్నారని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు