PM Modi: ముగిసిన 78 ఏళ్ల ప్రస్థానం.. సంక్రాంతినాడే కొత్త ఆఫీస్‌లోకి ప్రధాని మోదీ

భారత పరిపాలనా కేంద్రంగా, దేశ అత్యున్నత అధికారానికి చిరునామాగా ఉన్న ‘సౌత్ బ్లాక్’ శకం ముగియనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశ పరిపాలనా కేంద్రంగా ఉన్న 'సౌత్ బ్లాక్' నుండి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మొదటిసారిగా బయటకు రానుంది.

New Update
Central Vista

భారత పరిపాలనా కేంద్రంగా, దేశ అత్యున్నత అధికారానికి చిరునామాగా ఉన్న ‘సౌత్ బ్లాక్’ శకం ముగియనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి (1947) దేశ పరిపాలనా కేంద్రంగా ఉన్న 'సౌత్ బ్లాక్' నుండి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మొదటిసారిగా బయటకు రానుంది. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, జనవరి 14న ప్రధాని మోదీ(PM Modi) తన నూతన కార్యాలయం 'సేవా తీర్థ్'లోకి అడుగుపెట్టనున్నారు.

Also Read :  ఇరాన్‌‌ని టార్గెట్ చేస్తూ.. ఆ దేశాలపై ట్రంప్ మరోసారి టారీఫ్ బాంబు!

ఏమిటీ 'సేవా తీర్థ్'?

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా(Central Vista) పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ నూతన కార్యాలయ(new PMO office) సముదాయాన్ని నిర్మించారు. దీనికి 'సేవా తీర్థ్' అని పేరు పెట్టడం విశేషం. కేవలం అధికారం మాత్రమే కాకుండా, ప్రజలకు సేవ చేయడమే ఉద్దేశంతో ఈ పేరును ఖరారు చేశారు. ఈ సముదాయంలో మూడు ప్రధాన భవనాలు ఉన్నాయి.

సేవా తీర్థ్-1: ఇది ప్రధానమంత్రి కార్యాలయం (PMO)గా పనిచేస్తుంది. - Seva Teerth complex
సేవా తీర్థ్-2: ఇందులో క్యాబినెట్ సెక్రటేరియట్ ఉంటుంది.
సేవా తీర్థ్-3: ఇది జాతీయ భద్రతా సలహాదారు (NSA), జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ కోసం కేటాయించారు.

సౌత్ బ్లాక్ ప్రాధాన్యత -ముగిసిన 78 ఏళ్ల ప్రస్థానం

బ్రిటిష్ కాలంలో నిర్మించిన రాయ్‌సినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్, గత ఏడు దశాబ్దాలకు పైగా భారత ప్రధానులకు కార్యాలయంగా ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ నుండి నరేంద్ర మోదీ వరకు అందరూ ఇక్కడి నుండే పాలన సాగించారు. వలసవాద ఆనవాళ్లను తొలగించి, ఆధునిక భారత ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థను తీర్చిదిద్దడంలో భాగంగానే ఈ తరలింపు జరుగుతోంది.

Also Read :  ప్రియుడితో పారిపోయిన భార్య.. కాల్చిచంపిన భర్త

ఆధునిక హంగులు.. మ్యూజియంగా పాత భవనాలు

సుమారు రూ.1,189 కోట్ల వ్యయంతో, 2.26 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లార్సెన్ అండ్ టూబ్రో (L&T) ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. అత్యాధునిక సాంకేతికత, హై-సెక్యూరిటీ సిస్టమ్స్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో దీనిని నిర్మించారు. ప్రధాని కార్యాలయం ఖాళీ చేసిన తర్వాత, సౌత్ అండ్ నార్త్ బ్లాక్ భవనాలను 'యుగే యుగీన్ భారత్' పేరుతో జాతీయ మ్యూజియంగా మార్చనున్నారు. తద్వారా ఈ చారిత్రక కట్టడాలను సందర్శించే అవకాశం సామాన్య ప్రజలకు లభించనుంది.

Advertisment
తాజా కథనాలు