Cabinet Meeting: తెలంగాణలో ఫస్ట్ టైం మేడారంలో కేబినెట్ భేటీ.. రేవంత్ సర్కార్ చారిత్రక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా, ఓ మారుమూల గిరిజన గ్రామంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు మేడారంలోనే కేబినెట్ భేటీ జరగనుంది.

New Update
cabinet seethakka

cabinet seethakka Photograph: (cabinet seethakka)

తెలంగాణ పాలనలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా, ఓ మారుమూల గిరిజన గ్రామంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు(cm revanth telangana cabinet decisions). ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర 'మేడారం సమ్మక్క-సారలమ్మ' మహాజాతర(medaram sammakka sarakka) ను పురస్కరించుకుని, ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు మేడారంలోనే కేబినెట్ భేటీ జరగనుంది.

జనవరి 18 ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy Decisions in Telangana Cabinet Meeting) జనవరి 18 సాయంత్రం అక్కడికి చేరుకుంటారు. మంత్రుల బృందంతో కలిసి మేడారం చేరుకుని కేబినెట్ సమావేశం(cabinet-meeting) నిర్వహిస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. జనవరి 19 ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి, దర్శనం చేసుకుంటారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని, అదే రోజు రాత్రి ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (దావోస్) పర్యటనకు బయలుదేరుతారు.

Also Read :  పేరెంట్స్ ను పట్టించుకోపోతే జీతం కట్.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన!

కేబినెట్‌లో చర్చించనున్న కీలక అంశాలు

మేడారం వేదికగా జరగనున్న ఈ భేటీలో ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది. రైతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న రైతుభరోసా నిధుల విడుదలపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై శాఖల వారీగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు మరియు మేడారానికి 'జాతీయ పండుగ' హోదా సాధించే దిశగా తీర్మానం చేసే అవకాశం ఉంది. పాలనను క్షేత్రస్థాయికి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పం ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది.

Also Read :  గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షణ... సంక్రాంతికి బారులు తీరిన వాహనాలు... అయినను పోయిరావాలె

Advertisment
తాజా కథనాలు