/rtv/media/media_files/2026/01/13/visa-free-transit-2026-01-13-10-12-15.jpg)
భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు జర్మనీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జర్మనీ విమానాశ్రయాల మీదుగా మూడో దేశాలకు (ఉదాహరణకు అమెరికా, కెనడా లేదా యూకే) వెళ్లే ప్రయాణికులు ఇకపై విమానాశ్రయ ట్రాన్సిట్ వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సోమవారం (జనవరి 12)న జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల తర్వాత ఈ కీలక ప్రకటన చేశారు.
In principle a decision to exempt Indian nationals from the need of separate transit visa for travel to other countries from Germany, says Foreign Secretary Vikram Misri pic.twitter.com/j8he3xhWr5
— Sidhant Sibal (@sidhant) January 12, 2026
Also Read : ఇరాన్‌ని టార్గెట్ చేస్తూ.. ఆ దేశాలపై ట్రంప్ మరోసారి టారీఫ్ బాంబు!
ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. భారతీయులు జర్మనీ(Germany india ties) లోని ఫ్రాంక్‌ఫర్ట్ లేదా మ్యూనిచ్ వంటి విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లాలంటే, వారు విమానాశ్రయం దాటి బయటకు రాకపోయినా 'షెంజెన్ ట్రాన్సిట్ వీసా' కలిగి ఉండటం తప్పనిసరి. దీనివల్ల ప్రయాణికులు అదనపు ఖర్చుతో పాటు వీసా(visa-free transit) ప్రక్రియ కోసం చాలా సమయం వెచ్చించాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో ఈ నిబంధనను ఎత్తివేశారు. దీనివల్ల లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, నిపుణులు మరియు పర్యాటకులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఈ వీసా రహిత సౌకర్యం కేవలం విమానాశ్రయ అంతర్జాతీయ ట్రాన్సిట్ ఏరియాలో ఉండేవారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ప్రయాణికులు విమానాశ్రయం దాటి జర్మనీ నగరాల్లోకి వెళ్లడానికి వీలుండదు. యూకే లేదా అమెరికా వంటి దేశాలకు వెళ్లేవారు ఇప్పుడు జర్మనీ మీదుగా తక్కువ డాక్యుమెంట్లతో సులభంగా, వేగంగా ప్రయాణించవచ్చు. భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : ముగిసిన 78 ఏళ్ల ప్రస్థానం.. సంక్రాంతినాడే కొత్త ఆఫీస్‌లోకి ప్రధాని మోదీ
మోదీ-మెర్జ్ భేటీ హైలైట్స్:
ఛాన్సలర్ మెర్జ్(Chancellor Merz's visit) తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌కు రావడం విశేషం. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఈ భేటీలో రక్షణ, సాంకేతికత, హరిత ఇంధన రంగాల్లో 19 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారతీయ నైపుణ్యం కలిగిన కార్మికులను జర్మనీకి ఆహ్వానించేందుకు కూడా ఛాన్సలర్ సుముఖత వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ట్రాన్సిట్ వీసా రద్దు చేయడం ద్వారా భారతీయుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి" అని ఆనందం వ్యక్తం చేశారు.
Follow Us