Telangana Municipal Elections 2026: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కొన్ని రోజులుగా ఊరూవాడలా మారుమోగిన మైకులు, పార్టీల జెండాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి నేటితో తెరపడింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కొన్ని రోజులుగా ఊరూవాడలా మారుమోగిన మైకులు, పార్టీల జెండాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి నేటితో తెరపడింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు యువతకు పెద్దపీట వేశాయి. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు యువకులు ఆసక్తి చూపడంతో పలువురు 35 ఏళ్లలోపువారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
టెక్నాలజీ ముసుగులో సాగుతున్న భారీ ఆన్లైన్ గేమింగ్ దందా గుట్టును డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు రట్టు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు..చిన్న సమాచారంతో మొదలైన విచారణ ఏకంగా రూ. 5,000 కోట్ల భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది.
రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుంది. 11న పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల పైన ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. 10న రైతు భరోసా నిధులు జమచేయనుంది.
సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన రామరావు అనేవ్యక్తిని సైబర్ నేరగాళ్లు మూడు రోజులుగా మానసికంగా వేధించడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు.
వరంగల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన ఓరుగల్లు గడ్డపై తొలిసారిగా ఒక మోడల్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.
నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో శనివారం జరిగిన అగ్నిప్రమాదంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై డైరెక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
జగిత్యాల జిల్లాలో రాయికల్ పట్టణంలో అత్యంత వైభవంగా జరిగిన భీమన్న జాతరలో జంతు బలులు జరిగాయి. ఓ వ్యక్తి జంతువును పట్టుకుని.. అతని పంటితో కొరుకుతూ గావు పట్టారు. మూగజీవాన్ని ఇలా నోటితో కోరుకుతూ హింసించడంతో జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.