/rtv/media/media_files/xuwpsSA6ABVfhNQGCEGT.jpg)
మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వాలు ఏం చేయలేదని, వచ్చిన రెండేళ్లలోనే కాంగ్రెస్ సర్కార్ ఎన్నో హామీలు నెరవేర్చిందని చెప్పారు. ఓటు వేసే ముందు ఓటర్లు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.
బీజేపీపై సీఎం రేవంత్ తీవ్రమైన కామెంట్స్ చేశారు. మోడీ ప్రభుత్వం వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే, అక్కడి నుంచి 42 పైసలు మాత్రమే వస్తున్నాయి.. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది.. యూపీ రూపాయి చెల్లిస్తే, కేంద్రం ఆ రాష్ట్రానికి 2 రూపాయాలు తిరిగి ఇస్తుంది.. బీహార్ రూపాయి చెల్లిస్తే, అక్కడ ఆరు రూపాయాలు తిరిగి ఇస్తున్నారు.. ఉత్తరాది రాష్ట్రాలకు అత్యధిక నిధులు ఇస్తున్నారు.. ఈ వివక్షపై ఎప్పుడైనా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారా?.. 8 మంది ఎంపీలు గెలిస్తే.. మీరు రాష్ట్రానికి చేసిందేంటి అని ప్రశ్నించారు.గత GHMC ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తాం అంటూ హామీలు ఇచ్చిన బండి సంజయ్ ఇప్పటివరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదన్నారు. మోడీని చూసి ఓటు వేయాలని కిషన్ రెడ్డి చెబుతున్నారని... గల్లీ ఎన్నికలకు మోడీతో ఏం సంబంధమని రేవంత్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ను యాసిడ్ తో కడగాలి
పదేళ్లు సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. మున్సిపాలిటిలు ఇంత దారుణంగా ఉండటానికి కారణం మీరు కాదా అని ప్రశ్నించారు. వరదలు వస్తే కనీసం పట్టించుకున్నారా అని నిలదీశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఒక్కసారి కూడా సభకు రాలేదని జీతభత్యాలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదని, బీఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. మున్సిపాలిటిలకు కాంగ్రెస్ తోనే మహర్థశ ఉంటుందని తెలిపారు.
Follow Us