Panchayat Secretary : ఇందిరమ్మ ఇల్లుకు లంచం.. రూ. 10 వేలు తీసుకుంటూ దొరికిపోయాడు!
తాజాగా కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పంచాయతీ సెక్రటరీ అనిల్.
తాజాగా కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పంచాయతీ సెక్రటరీ అనిల్.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. టికెట్ నవీన్ యాదవ్ కు కేటాయించడంతో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అలకబూనారు. దీంతో ఆయనను పార్టీ పెద్దలు బుజ్జగించే పనిలో పడ్డారు.
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించి విముక్తి కలిగించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి విద్య అనే మహిళ మమ్మల్ని మోసం చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.18 కోట్ల వరకు మోసం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు.
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలపై ఆయన స్పందించారు. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో తాను లేనన్న ఆయన.. బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవమని అన్నారు.
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జీడిమెట్ల పరిధిలో 220 కేజీల ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించామన్నారు.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో విచారణ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై ఆరు వారాల పాటు స్టే హైకోర్టు విధించింది. ఈమేరకు జీవో నంబర్ 9పై స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.