Forensic Lab: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంలో.. కాలి బూడిదైన ఓటుకు నోటు కేసు ఆధారాలు

నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో శనివారం జరిగిన అగ్నిప్రమాదంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై డైరెక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

New Update
napally fire accident

నాంపల్లి(nampally) లోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) లో శనివారం జరిగిన అగ్నిప్రమాదం(Hyderabad Forensic Lab Fire) పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై డైరెక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

Also Read :  హీరో మంచు విష్ణుకు బిగ్ షాక్..

2015 నాటి ఈ కేసుకు సంబంధించి మొత్తం 16 మెటీరియల్ అప్పట్లోనే ఎఫ్‌ఎస్‌ఎల్ పరిశీలించింది. 2021లోనే వాటి నివేదికలతో పాటు ఆధారాలను ఏసీబీ కోర్టుకు తిరిగి సమర్పించామని, ప్రస్తుతం ల్యాబ్‌లో ఆ కేసుకు సంబంధించిన ఎలాంటి డేటా లేదని ఆమె తెలిపారు. కాబట్టి ఈ కేసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం అసత్యమని కొట్టిపారేశారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసు: 2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మొత్తం 136 మెటీరియల్స్ అందాయి. ఇందులో 129 మెటీరియల్స్‌ను ఇప్పటికే విశ్లేషించి అధికారులకు నివేదికలు పంపామన్నారు. మిగిలిన 7 వస్తువులు మాత్రమే ల్యాబ్‌లో ఉండగా, ప్రమాద సమయంలో అవి స్వల్పంగా దెబ్బతిన్నాయని(evidence destroyed), వాటిని త్వరలోనే రిట్రీవ్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read :  మున్సిపల్‌ ఎన్నికల్లో కోటిశ్వరులు.. ఆ పీఠాలే లక్ష్యంగా బరిలోకి..

ప్రమాదం జరిగిన తీరు

శనివారం ఉదయం 10:08 గంటలకు ల్యాబ్ మొదటి అంతస్తులోని కంప్యూటర్ సెక్షన్‌లో మంటలు చెలరేగాయి. ఎఫ్‌ఎస్‌ఎల్ ఉద్యోగి సాయికృష్ణ వెంటనే గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది 10:30 గంటలకు చేరుకుని మధ్యాహ్నం 1:30 గంటల కల్లా మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం (బహుశా షార్ట్ సర్క్యూట్) మరియు ఆస్తి నష్టంపై ఇంకా విచారణ జరుగుతోందని డైరెక్టర్ తెలిపారు. ముఖ్యమైన డేటా మొత్తం బ్యాకప్ సర్వర్లలో భద్రంగా ఉంటుందని, ప్రజలు పుకార్లను నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisment
తాజా కథనాలు