CM Revanth: ఖాతాల్లోకి 6 వేలు.. మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ గుడ్ న్యూస్!

రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుంది. 11న పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల పైన ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. 10న రైతు భరోసా నిధులు జమచేయనుంది.

New Update
Rythu Bharosa Funds

Rythu Bharosa Funds

Raitu Bharosa : రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుంది. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు అమలుకు సిద్దమైంది. రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల పైన ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. 

రైతులకు  పంటల సాగు ప్రారంభంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’(rythu-bharosa) పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖరీఫ్, యాసంగి సీజన్లలో రెండు విడతలుగా ఎకరానికి రూ.6వేలు చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి ఖరీఫ్ సీజన్‌కు డబ్బులు జమకాగా.. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కాగా యాసంగి సీజన్ ఎప్పుడో ప్రారంభమైంది. రైతులు వివిధ పంటలను సాగుచేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం నగదు విడుదలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

Also Read :  మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ.. ఆలోచించి ఓటేయండి : సీఎం రేవంత్

Good News From CM Revanth During The Municipal Elections

అయితే  ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో రైతు భరోసా(big twist in rythu bharosa scheme) నిధులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పలు చోట్ల అధికార పార్టీ నేతలకు రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలో యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా పథకానికి సంబంధించి రూ.9వేల కోట్లను పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy on rythu bharosa) ప్రజాపాలన.. ప్రగతిబాట పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రకటించారు. యాసంగి సీజన్‌లో పంపిణీ చేయడానికి వ్యవసాయశాఖ రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. అయితే, రైతు భరోసా పథకం నిధులు జమ చేయడానికి ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేనట్లుగా తెలుస్తోంది. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ఆర్బీఐకి రూ.9వేల కోట్ల రుణం కోసం ఇండెంటు పెట్టింది. ఈనెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఆ తదుపరి రైతుల ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకవేళ ఈనెల 10వ తేదీన రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయకుంటే.. ఆ తరువాత మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు సమకూరకుంటే.. మున్సిపల్ ఎన్నికల తరువాత రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమచేసే పరిస్థితులు ఉండకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు ముగసిన తర్వాత మళ్లీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు రైతు భరోసా నిధులు జమయ్యే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే, ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలలో ఎలా ముందుకెళ్తుందోనన్న అంశంపై రైతులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక రైతుభరోసా వేయరన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుభరోసా అనేది గతంలో ఉన్న పథకమే కావడంతో దీనికి కోడ్ వర్తించదని చెబుతున్నారు. సో..అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది.

Also Read :  పాత జిల్లాలు రద్దు.. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ!

Advertisment
తాజా కథనాలు