Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో యువతదే పై చేయి..35 ఏళ్లవాళ్లు ఎంతమందంటే?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు యువతకు పెద్దపీట వేశాయి. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు యువకులు ఆసక్తి చూపడంతో పలువురు 35 ఏళ్లలోపువారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

New Update
FotoJet - 2026-02-09T172753.693

Municipal elections

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాగా ఈ ఎన్నిక(political) ల్లో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బిఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు యువత(youth) కు పెద్దపీట వేశాయి. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు యువకులు ఆసక్తి చూపడంతో ఈసారి ఎన్నికల్లో పలువురు 35 ఏళ్లలోపువారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు. రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. 

ప్రస్తుతం యువతకు రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి 12 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో పోటీ చేస్తున్నవారిలో 300 మంది అభ్యర్థులు 35 ఏళ్లలోపు వారే ఉండడం గమనార్హం. రాజకీయాలు చేయడం, ప్రజా ప్రతినిధులు కావడమనేది పెద్దవారికి మాత్రమే కాదని,అవకాశమిస్తే తాము కూడా తమ సత్తా ఏంటో నిరూపిస్తామని యువత చెబుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా యువత మున్సిపల్స్ బరిలో దిగుతున్నారు.

Also Read :  మద్యం ప్రియులకు బిగ్ షాక్.. వరుసగా వైన్స్ షాపులు బంద్!

Telangana Municipal Elections 2026

వరంగల్ ఉమ్మడి జిల్లా పరంగా చూసుకుంటే జనగామ మున్సిపాలిటీలో 127 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వారిలో 16 మంది 35 ఏళ్ల లోపు వారున్నారు. 35 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారు 48 మంది 45 ఏళ్లకు పైబడిన వారు 63 మంది బరిలో ఉన్నారు. ఇక భూపాలపల్లిలో 107 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 28 మంది 35 ఏళ్లలోపు వారు,52 మంది 35 నుంచి 45 ఏళ్ల లోపు, 27 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో 82 మంది బరిలో ఉండగా 22 మంది 35 ఏళ్లలోపు, 27 మంది 35 నుంచి 45 ఏళ్లలోపు, 31 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. పరకాలలో 100 మంది బరిలో ఉండగా 28 మంది 35 ఏళ్లలోపు,51 మంది 35 నుంచి 45ఏళ్ల లోపు,21 మంది 45 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
 
మహబూబాబాద్ లో 155 మంది బరిలో ఉండగా 53 మంది 35 ఏళ్లలోపు, 59 మంది 35 నుంచి 45 ఏళ్లలోపు, 43 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. వర్ధన్నపేటలో 50 మంది బరిలో ఉండగా 23 మంది 35 ఏళ్లలోపు వారు, 13 మంది 35 నుంచి 45 ఏళ్లలోపు, 14 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. ములుగులో 83 మంది బరిలో ఉండగా 23 మంది 35 ఏళ్లలోపు 24 మంది 35 నుంచి 45 ఏళ్ల లోపు,36 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. నర్సంపేటలో 120 మంది బరిలో ఉండగా 26 మంది 35 ఏళ్లలోపు, 46 మంది 35 నుంచి 45 ఏళ్లలోపు, 48 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. కేసముద్రంలో 58 మంది బరిలో ఉండగా 21 మంది 35 ఏళ్లలోపు,20 మంది 35 నుంచి 45 ఏళ్లలోపు,17 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు.

 తొర్రూరులో 63 మంది బరిలో ఉండగా 19 మంది 35 ఏళ్లలోపు, 21 మంది 35 నుంచి 45 ఏళ్లలోపు, 23 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు.డోర్నకల్ లో 64 మంది బరిలో ఉండగా 15 మంది 35 ఏళ్లలోపు, 27 మంది 35 నుంచి 45 ఏళ్లలోపు, 22 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. మరిపెడలో 63 మంది బరిలో ఉండగా 26 మంది 35 ఏళ్ల లోపు, 17 మంది 35 నుంచి 45 ఏళ్లలోపు, 20 మంది 45 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు.  

ఈ ఎన్నికల్లో 35 నుంచి 45 ఏళ్లలోపు వారిని పరిశీలిస్తే అత్యధికంగా 405 మంది పోటీ చేస్తున్నారు. వ్యాపారాల్లో కొనసాగుతున్న మధ్య వయసు వారంతా స్థానిక రాజకీయాలపై మరింత ఆసక్తితో ఉన్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో పాటు ఆర్థికంగా కొంత కుదురుకోవడంతో పోటీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాజకీయ సామాజిక సమీకరణలు కలిసి రావడం, అర్థ బలం, అంగ బలం పార్టీ నాయకులకు సన్నిహితులుగా ఉండడం వీరికి కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.

యువత రాజకీయాల్లోకి రావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. విద్యా, ఉద్యోగం తదనంతరం బాధ్యతల కారణంగా చాలామంది యువత రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వచ్చే అవకాశాలను కొందరు అందిపుచ్చుకొని రాజకీయాల్లో రాణించేందుకు సిద్ధమవుతున్నవారు. సామాజిక సేవల్లోనూ, యువజన సంఘాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తూ జనంలో తిరిగే యువతరం స్థానిక ఎన్నికలను అవకాశంగా మల్చుకొని ముందుకెళ్తున్నారు.

తమకు రాజకీయాలంటే ఎంతో ఆసక్తి అని విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నామని పలువురు అభ్యర్థులు అంటున్నారు. విద్యార్థి సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారు, సామాజిక, యువజన సంఘాలను నిర్వహిస్తున్నవారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనే తపనతో ఎన్నికల బరిలో నిలిచామని తెలిపారు.సమాజంలో మార్పు రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు.

Also Read :  ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంలో.. కాలి బూడిదైన ఓటుకు నోటు కేసు ఆధారాలు

Advertisment
తాజా కథనాలు