Crime: మరో ఘోరం.. వేరు కాపురం పెడదామన్న భార్య.. ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త!
మహారాష్ట్రలోని భివండిలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి సముద్రంలో పారేశాడు. ఇంటిని వేరుగా పెట్టుకునే విషయంలో ఆగస్టు 28న దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.