/rtv/media/media_files/2025/10/22/iron-pan-2025-10-22-15-32-22.jpg)
Iron pan
రోజూ ఇంట్లో వాడే ఇనుప పెనం (Tawa) మన వంటగదిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే.. దీని అంచులపై మొండి పట్టిన నల్లటి జిడ్డు, మాడిన పొర పేరుకుపోతే.. దాన్ని శుభ్రం చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడే మహిళల కోసం.. కొన్ని సులభమైన, సమయాన్ని ఆదా చేసే చిట్కాలు ఉన్నాయి. ఈ పద్ధతులను ఉపయోగించి పెనాన్ని నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించవచ్చు. మాడి నల్లబడిన పెనంపై జిడ్డు తొలగించే అద్భుతమైన చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పెనంపై నల్లటి జిడ్డు తొలగించడానికి..
నిప్పుపై కాల్చే పద్ధతి (Direct Burning Method): ముందుగా పెనాన్ని బోర్లించి (వెనుక వైపు) పొయ్యిపై తక్కువ మంట మీద పెట్టండి. పెనంపై పేరుకుపోయిన నల్లటి పొర మొత్తం కాలి.. బూడిదగా మారే వరకు నెమ్మదిగా తిప్పుతూ కాల్చండి. గ్యాస్ ఆపి, పెనం కొద్దిగా చల్లబడిన తర్వాత చెంచా లేదా గరిటెతో ఆ బూడిద పొరను సులభంగా గీకి తీసేయండి. మిగిలిన మురికిని స్టీల్ నార (స్టీల్ స్క్రబ్బర్) లేదా స్క్రబ్బర్‌తో బాగా రుద్ది.. డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో శుభ్రం చేయాలి.
బేకింగ్ సోడా-నిమ్మకాయ: పెనాన్ని కాల్చకుండా శుభ్రం చేయాలంటే ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 2-3 టీస్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని.. కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను పెనంపై మాడిన చోట రాయలి. దానిపై సగం నిమ్మకాయను పిండి 15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రం చేయాలి. తేలికపాటి జిడ్డుకు ఇది బాగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి: హెయిర్ స్పాకి వెళ్ళేముందు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే మీ జుట్టు సంగతి అంతే!!
వెనిగర్- ఉప్పు: స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో వైట్ వెనిగర్, నీరు కలిపి ద్రావణాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని పెనం అంచులపై స్ప్రే చేసి.. దానిపై కొద్దిగా ఉప్పు చల్లి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత స్పాంజ్‌తో రుద్ది శుభ్రం చేయాలి. ఇది మొండి పట్టిన జిడ్డును తొలగించి.. పెనానికి మెరుపును ఇస్తుంది.
రోజూవారీ జాగ్రత్తలు: నల్లబడిన పెనం తయారవడానికి ప్రధాన కారణం సరైన రోజువారీ శుభ్రత లేకపోవడమే. పెనం శుభ్రం చేసిన తర్వాత.. తప్పకుండా కొద్దిగా నూనె రాయడం వల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే పెనం ఎప్పుడూ కొత్తదానిలా మెరుస్తుందని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ఈ 5 లక్షణాలు కనిపిస్తే తలనొప్పి కాదు.. బ్రెయిన్ క్యాన్సర్.. జాగ్రత్త!