Telugu Health Tips: పొట్టను మాయం చేసే 7 పండ్లు ఏంటో తెలుసా..?

పండ్లను తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. ముఖ్యంగా బొప్పాయి, పుచ్చకాయ, జామ, కర్బుజా, కీరదోస, బత్తాయి, కమల వంటి అధిక నీరు ఉన్న పండ్లు పొట్టను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Fruits

Fruits

నేటి కాలంలో శరీరంలోని కొవ్వు వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ కొవ్వు తగ్గాలని అనేక విధాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రయత్నాలు విఫలంగా మిగులుతాయి. అయితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేకుండా.. కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బొప్పాయి, పుచ్చకాయ, జామ, కర్బుజా, కీరదోస, బత్తాయి, కమలపండ్లు వంటి అధిక నీరు ఉన్న పండ్లు పొట్టను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. సులభంగా పొట్టను తగ్గించే పండ్లు, ఆరోగ్య నిపుణుల సలహాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పొట్టను తగ్గించే పండ్లు:

ఈ పండ్లలో ఫైబర్ శాతం, నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. ఇవి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించడం ద్వారా మనం తీసుకునే ఆహారం పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఉదాహరణకు.. పుచ్చకాయలో గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్ ఉన్నప్పటికీ అధిక నీటి శాతం కారణంగా ఇది త్వరగా కడుపు నింపుతుంది. తద్వారా ఎక్కువ ఆహారం తీసుకోవాలనే కోరికను నియంత్రిస్తుంది. అంతేకాక కార్బోహైడ్రేట్లు ఎక్కువగా శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంలో కూడా ఇవి సహాయపడతాయి.

 ఇది కూడా చదవండి: వెండి పాదరక్షలు ఇంటి వద్దనే మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు.. ఎలానో తెలుసుకోండి

తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండి.. తీపి తక్కువగా లేదా సహజమైన తీపితో కూడిన, అధిక నీటి శాతం ఉన్న పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అటువంటి పండ్లను టిఫిన్‌గా లేదా రాత్రి భోజనంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే.. క్రమంగా పొట్ట కొవ్వు తగ్గడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్లలోని ఫైబర్ జీర్ణవ్యవస్థకు సహాయపడటమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందించి.. అనారోగ్యకరమైన కొవ్వు పేరుకుపోకుండా రక్షిస్తుంది. ఈ సహజమైన పద్ధతిలో ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా, సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: పొద్దునే లేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు