/rtv/media/media_files/2025/10/23/black-coffee-2025-10-23-10-02-59.jpg)
Black coffee
నేటి కాలంలో చాలామంది తమ రోజును టీ లేదా పాల కాఫీతో మొదలుపెడతారు. అయితే ఈ రెండూ ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే వాటికి బదులుగా బ్లాక్ కాఫీ తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పరగడుపున దీన్ని తాగితే మరింత ప్రయోజనం చేకూరుతుంది. ప్రముఖ పోషకాహార నిపుణులు (Nutritionist) ఉదయం బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే 3 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలుపుతున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పరగడుపున బ్లాక్ కాఫీ:
శక్తి, ఏకాగ్రత: ఉదయం బ్లాక్ కాఫీ తాగడం వల్ల రోజంతా ఏకాగ్రత (Focus), చురుకుదనం (Alertness), ఉత్పాదకత (Productivity) పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాఫీలోని కెఫీన్ మెదడును చురుకుగా ఉంచి.. కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల ఉదయం లేవగానే ఉండే బద్ధకం తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది.
జీర్ణవ్యవస్థకు మంచిది (Gut Health): బ్లాక్ కాఫీ కేవలం శక్తిని మాత్రమే కాదు జీర్ణవ్యవస్థ (Gut Health) ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనివల్ల కడుపు తేలికగా ఉండి.. ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్ధకం (Constipation) ఉన్నవారు ఉదయం బ్లాక్ కాఫీతో రోజును ప్రారంభించవచ్చు.
ఇది కూడా చదవండి: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగారంటే ఈ సమస్యలన్నీ పరార్
మెదడు-కాలేయానికి మేలు: బ్లాక్ కాఫీ కాలేయం (Liver) ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు తెలిపారు. ఇది కాలేయ వాపును (Inflammation) తగ్గించడానికి, కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. అంతేకాక కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మితంగా బ్లాక్ కాఫీని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు కూడా కనుగొన్నాయి. ఉదయం బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. దీనిని మితంగానే తీసుకోవాలి. రోజుకు 1-2 కప్పుల బ్లాక్ కాఫీ సరిపోతుందని నిపుణులు సూచించారు. అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల అసిడిటీ, డీహైడ్రేషన్ లేదా నిద్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బ్లాక్ కాఫీతో కాలేయానికి రక్షణ.. సిర్రోసిస్, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందంటున్న నిపుణులు!!