Flaxseed Water: వామ్మో ఖాళీ కడుపుతో ఫ్లాక్స్ సీడ్స్ నీరు తాగాలా..? ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!!

రాత్రిపూట నానబెట్టిన ఫ్లాక్స్ సీడ్స్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్‌లో అధిక కొవ్వు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి, మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Flaxseed water

Flaxseed Water

Flaxseed Water: ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకునేవారు ఆహారంలో ఫ్లాక్స్ సీడ్స్‌ను ఎక్కువగా చేర్చుకుంటున్నారు. ఈ చిన్న గింజలు పోషకాల గని. సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయని న్యూట్రిషన్‌ నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట నానబెట్టిన ఫ్లాక్స్ సీడ్స్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఉన్నాయని అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్లాక్స్ సీడ్స్‌లో కొవ్వు (Fat) అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కొవ్వు రోజంతా శరీరానికి శక్తిని అందించి, చురుకుగా ఉంచుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ (Metabolism) మెరుగుపడి, రోజంతా శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. నీటిలో నానబెట్టిన అవిసె గింజలను తింటే ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో వాటిని తినడం వల్ల..

మెదడుకు ఇంధనం (Fuel for the Brain): ఫ్లాక్స్ సీడ్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కేవలం శరీరానికే కాక.. మెదడుకు కూడా ఇంధనంలా పనిచేస్తాయి. ఖాళీ కడుపుతో ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల మెదడుకు తక్షణ శక్తి అందుతుంది. ఇది ఏకాగ్రత (Focus), దృష్టి (Concentration)ని పెంచుతుంది. విద్యార్థులు లేదా ఉద్యోగం చేసేవారికి ఇది సహజమైన బ్రెయిన్ బూస్టర్‌గా పనిచేస్తుందని న్యూట్రి చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: రాత్రి మధ్యలో నిద్ర లేస్తున్నారా..? కారణాలు, పరిష్కారాలు తెలుసుకోండి!!

కడుపు సమస్యలకు ఉపశమనం: మలబద్ధకం (Constipation), గ్యాస్, ఉబ్బరం (Bloating), ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఫ్లాక్స్ సీడ్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే గట్ ఆరోగ్యం (Gut Health) మెరుగుపడుతుంది. ఇది జీర్ణనాళంలో వచ్చే మంటను తగ్గించి.. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయం మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. ఒక టీస్పూన్ అవిసె గింజలను తీసుకుని మెత్తటి పొడిలా చేసుకోవాలి. తయారు చేసిన ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో బాగా కలిపి తిప్పుకోవాలి. ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. అయితే ఏవైనా అలెర్జీలు, దీర్ఘకాలిక కడుపు సమస్యలు ఉన్నట్లయితే. ఫ్లాక్స్ సీడ్స్‌ను ఆహారంలో చేర్చుకునే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: తెలంగాణలో డేంజర్ బెల్స్.. ప్రతీ 100 మందిలో ఏడుగురికి కిడ్నీలు ఖరాబ్.. షాకింగ్ రిపోర్ట్!

Advertisment
తాజా కథనాలు